Skip to main content

Department Test Schedule : వివిధ విభాగాల్లో ఉద్యోగాల‌కు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌కు షెడ్యూల్ విడుద‌ల‌..

డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లో పాల్గొనే అభ్య‌ర్థుల‌కు నిర్వ‌హించే స‌ర్టిఫికెట్ ప‌రిశీల‌న ప్ర‌క్రియ గురించి వివ‌రించారు అధికారులు..
 Test Details Available on Official Website  APPSC Departmental Test Schedule Released   APPSC Service Commission Secretary Pradeep Kumar  28th July to 2nd August  APPSC releases the Department Test Schedule for jobs in various fields

అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను  https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.

⇒ ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ విభాగంలో శాంపిల్‌ టేకర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీ­లించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరి­జినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన హేమంత్ సోరేన్

⇒  ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల­కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25­న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించి­న తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 

⇒ హోమియో విభాగంలో మెడికల్‌ ఆఫీ­సర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. 

⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చే­సింది. వివరాలను సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు.

Carrington Event: పొంచి ఉన్న ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’.. మానవాళికి పెను ముప్పు?

Published date : 05 Jul 2024 10:42AM

Photo Stories