Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన హేమంత్ సోరేన్
Sakshi Education
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు.
జూలై 4వ తేదీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.
భూకుంభకోణం కేసులో చిక్కుకుని జైలు పాలైన హేమంత్‌ను ఈడీ ఈ సంవత్సరం జనవరిలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన తాజాగా రెగ్యులర్ బెయిల్ లభించింది. దీంతో ఐదు నెలలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన చంపై సోరెన్ తప్పుకున్నారు. కాగా ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
Pema Khandu: అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం.. వరసగా మూడోసారి
Published date : 05 Jul 2024 10:24AM