Skip to main content

పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

తిరుచానూరు(తిరుపతి జిల్లా): శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జనవరి 3వ తేదీన పీజీ స్పాట్‌ అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఆచార్య సువర్ణ లతాదేవి డిసెంబర్‌ 30న ఒక ప్రకటనలో తెలిపారు.
Sri Padmavati Mahila University
పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, అప్లయిడ్‌ మైక్రో బయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ, సెరీకల్చర్, అప్లయిడ్‌ మ్యాథమ్యాటిక్స్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రీషన్‌ సైన్సెస్, ఫిజిక్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, క్లినికల్‌ సైకాలజీ, స్టాటిస్టిక్స్, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు.

చదవండి: Admission in Indian Army: ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ - 48 కోర్సులో ప్రవేశాలు..

ఎంఏ ఇంగ్లిష్, తెలుగు, సోషల్‌ వర్క్, ఎకనావిుక్స్, జెండర్‌ స్టడీస్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్, మ్యూజిక్, భరతనాట్యం, ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌తోపాటు కామర్స్‌ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. ఏపీపీజీ సెట్‌–2022లో ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాలకు www.spmvv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. 

చదవండి: AP Fisheries University: ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలు..

Published date : 31 Dec 2022 04:05PM

Photo Stories