Anganwadi posts: భారీగా 3,989 అంగన్వాడీ పోస్టులు... నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పష్టంగా వెల్లడించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంలో టీఎస్‌పీఎస్సీ, వివిధ ప్రత్యేక బోర్డ్‌ల ద్వారా ఈ నోటిఫికేషన్ల విడుదలకు సన్నహాలు చేస్తుంది.
3,989 అంగన్వాడీ హెల్పర్ల ఉద్యోగాలకు..
తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రిగా సీతక్క డిసెంబర్ 14వ తేదీన (గురువారం) సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 3,989 అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించినా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటి మార్పు జరగలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫైల్ పైనా మంత్రి సంతకం చేయడంతోపాటు అప్గ్రేడ్ చేసిన కేంద్రాలకు కొత్తగా 3,989 హెల్పర్లను నియమించుకునే ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు ఉచిత శిక్షణ..ఎక్కడంటే : Click Here
ప్రతిజిల్లాకు ఒక శిశుసంరక్షణ కేంద్రం (క్రెచ్ సెంటర్) ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల్లో ఆరునెలల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు సంరక్షిస్తారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు సంరక్షకులు ఉంటారు. కేంద్రాల నిర్వహణ, వేతనాల చెల్లింపులకు రూ.1.27 కోట్లు కేటాయించారు. ఈ ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల ఎదుగుదల, పోషణస్థితిని అచనా వేసేందుకు, ఎత్తు, బరువు కొలిచేందుకు పోషన్ అభియాన్ 2.0 పథకం కింద పరికరాల కొనుగోలుకు రూ.28.56 కోట్లు మంజూరు చేస్తూ ఇందుకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేశారు. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా ఉండనుంది.
తాజాగా 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని..
తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్స్, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు.
అయితే గత ప్రభుత్వం అవసరమైన చోట నూతన అంగన్వాడిలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది.
గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు: Click Here
కొత్తగా 8000 ఉద్యోగాలకు..
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే అంగన్‌వాడీలలో 4000 వరకు ఖాళీలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా..
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ వివరాలు పంపింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.
ఈ సూచనలకు అనుగుణంగా పోస్టులను..
మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
Tags
- Anganwadi
- Anganwadi Posts
- Anganwadi Helper Jobs
- TS govt jobs
- Anganwadi Supervisor
- ts anganwadi jobs
- AP Anganwadi Jobs 2023
- anganwadi jobs
- anganwadi jobs in telangana 2023
- Anganwadi Jobs in andhra pradesh
- Anganwadi Worker Jobs
- Anganwadi free kits
- Anganwadi helper
- trending jobs
- latest Anganwadi news
- Anganwadi Teachers
- district wise anganwadi vacancy
- anganwadi notification telugu news
- ts anganwadi notification 2023
- Telugu News
- AP Latest Jobs News 2023
- ap anganwadi jobs news in telugu
- Latest Telugu News
- Telangana News
- AP News
- latest jobs in 2023
- sakshi education job notifictions