Skip to main content

Spot Admissions: పీజీలో ఖాళీ సీట్లను భర్తీ చేయాలి

pg admission in Telangana University

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆయన వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం క్యాంపస్‌ పీజీ అడ్మిషన్లలో అన్ని కోర్సులలో కలిపి సుమారు 200 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్పాట్‌ అడ్మిషన్స్‌ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయాలని కోరారు. నాయకులు శివసాయి, ఆకాష్‌, హన్మాండ్లు, అశ్విత్‌, తరుణ్‌, రాము, రాజు, మన్యంకొండ పాల్గొన్నారు.

☛ 26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 08 Dec 2023 04:03PM

Photo Stories