Skip to main content

IIIT: అడ్మిషన్ల నోటిఫికేషన్‌ వివరాలు

Notification details of IIIT Admissions
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITల్లో పీయూసీల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకుగాను ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు RGUKT చాన్స్‌లర్‌ ఆచార్య కేసీ రెడ్డి జూన్‌ 23న తెలిపారు. నూజివీడులో ‘Sakshi’తో ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని కూడా ప్రభుత్వం రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తున్నందున జూలై నెలాఖరుకు పదో తరగతి పరీక్షల ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత ఆగస్టు తొలి వారంలో అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఆగస్టు నెలాఖరుకల్లా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 4 ట్రిపుల్‌ఐటీల్లో ఒక్కొక్క దానిలో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్‌ స్కోర్‌ను ఇవ్వడం జరుగుతుందన్నారు. కాగా, జూలై 8న ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. ఆర్జీయూకేటీ వైస్‌ చాన్స్‌లర్‌ పదవిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ ఇచ్చామని, త్వరలోనే రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ను నియమిస్తామని తెలిపారు.

చదవండి: 

Published date : 24 Jun 2022 02:39PM

Photo Stories