Skip to main content

ఆర్జీయూకేటీలో ప్రవేశాలపై ఉన్నతస్థాయి కమిటీ

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో ప్రవేశాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చే అంశంపై శాస్త్రీయ అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈమేరకు ఉన్నత విద్యాశాఖ జనవరి 2 (గురువారం)న ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ బి.శేషశయనారెడ్డి చైర్మన్‌గా ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి మెంబర్ కన్వీనర్‌గా, ఉన్నత విద్యామండలి మాజీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్ సభ్యుడిగా ఈ కమిటీని నియమించింది. ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు 0.4 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. దీనిపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలవుతూ ప్రవేశాలకు ఆటంకంగా మారుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్ధులు పేదలే అయినందున వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
Published date : 03 Jan 2020 03:09PM

Photo Stories