ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ: ఆర్జీయూకేటీ
Sakshi Education
వేంపల్లె: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్స్ లర్ కె.చెంచురెడ్డి పేర్కొన్నారు.
ట్రిపుల్ ఐటీలకు ప్రభుత్వం రూ.148 కోట్ల నిధులు మంజూరు చేసిందని, నిర్వహణ, మౌలిక వసతులకు సంబంధించి రూ.230 కోట్లకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. జూన్ 5 (శుక్రవారం)నవైఎస్సార్‌జిల్లా ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జూలై 7, 8వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో పర్యటిస్తారని చెప్పారు. ఆర్‌కే వ్యాలీ క్యాంపస్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్జీయూకేటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మే 30వ తేదీకి ఆన్‌లైన్ తరగతులు ముగిశాయని తెలిపారు.
Published date : 06 Jun 2020 02:02PM