సాక్షి, హైదరాబాద్: పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 4 నుంచి 5వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని నవంబర్ 3న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని, కళాశాల వారీగా సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తెలిపింది. మరిన్ని వివరాలకు www. knruhs.telangana.gov.in చూడాలని స్పష్టం చేసింది.