అడ్మిషన్లలో 10% ఎస్టీ రిజర్వేషన్లు
ఎంబీబీఎస్, బీడీ ఎస్, హోమియోపతి, ఆయుర్వేద, నాచురోపతి వంటి సీట్లలో పెరిగిన ఎస్టీ రిజర్వేషన్లు అమలు కానున్నా యని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఈ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశముంది. ఇటీవలే నీట్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అడ్మిషన్ల ప్రక్రియ కు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేప థ్యంలో ఇటీవలే ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విది తమే. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లో ఎస్టీలకు 10% రిజర్వే షన్లు వర్తింపజేసేలా నిబంధన ఉంటుందని కాళోజీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు అనుమతి రావాల్సి ఉందని, అందుకోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నాయి.
చదవండి: Telangana : ఈ విద్యార్థులకు శుభవార్త.. 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే..
ఎస్టీలకు 360 ఎంబీబీఎస్ సీట్లు
కాళోజీ వర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు 3,600 ఉన్నాయి. పెరిగిన 10% రిజర్వేషన్ ప్రకారం గిరిజన విద్యార్థులకు 360 ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేమని యంత్రాంగం చెబుతోంది. సోమవా రం జరిగిన విలే కరుల సమావేశంలోనూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మెడికల్ సీట్లలో 10% గిరిజన రిజర్వే షన్ల అమలుపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. నోటిఫికే షన్ సందర్భంగా కాళోజీ వర్సిటీ వీసీ వివరాలు వెల్లడిస్తారని మాత్రమే చెప్పారు. న్యాయపరమైన చిక్కు లకు అవకాశం లేకుండా దీనిపై ముందుకు వెళ్తామని అధికారులు చెబుతున్నారు. ‘పెంచిన గిరిజన రిజర్వేషన్లు అమలు చేయడం తప్పనిసరి. ఇందులో అనుమానాలకు తావులేదు. అయితే ఇటీవలే ఉత్తర్వులు వచ్చినందున ప్రభుత్వం న్యాయపరమైన సలహాలు తీసుకుంటోంది. పైగా ఎవరైనా జనరల్ కేటగిరీ విద్యార్థులు తాము సీట్లు కోల్పోతామని కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా సరిచూసుకొని ముందుకు వెళ్తాం’అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కాగా, పీజీ మెడికల్ సీట్లకు కూడా అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. కానీ, ఆయా సీట్లకు మాత్రం పెరిగిన గిరిజన రిజర్వేషన్లు ఈసారి వర్తించవని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్