Skip to main content

Telangana : ఈ విద్యార్థులకు శుభ‌వార్త‌.. 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో మెడిసిస్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
T Harish Rao
Harish Rao

వెయ్యికిపైగా ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్‌ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్‌ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు.

ఇకపై కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్‌ కోటా కింద సీట్లు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీష్‌ రావు స్పష్టం చేశారు. ఈ మేరకు సెప్టెంబ‌ర్ 29వ తేదీన (గురువారం) జీవో నెంబర్ 129, 130 లను ప్రభుత్వం విడుదల చేసింది. 

85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే..

TS

ప్రభుత్వ నిర్ణయంతో మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్-బీ కేట‌గిరీ సీట్ల‌లో కేటాయించే 35శాతం సీట్ల‌లో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థుల‌కే దక్కనున్నాయి. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే ల‌భించ‌నున్నాయి.

Published date : 29 Sep 2022 03:22PM

Photo Stories