Skip to main content

KNRUHS: పీజీ డెంటల్ కటాఫ్ మార్కుల తగ్గుదల

పీజీ డెంటల్‌ కటాఫ్‌ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది.
KNRUHS
పీజీ డెంటల్ కటాఫ్ మార్కుల తగ్గుదల

ఈ మేరకు విశ్వవిద్యాలయం అక్టోబర్‌ 17న ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌–2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25.714 పర్సెంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సెంటైల్‌ 174 మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 14.286 పర్సెంటైల్‌ 138 మార్కులు.. దివ్యాంగులకు 19.286 పర్సెంటైల్‌ 157 మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు.

చదవండి: High Court: నీట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొననివ్వండి

కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు అక్టోబర్‌ 18 ఉదయం 8 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను www. knruhs.telangana.gov.inను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 

చదవండి: 

అడ్మిషన్లలో 10% ఎస్టీ రిజర్వేషన్లు

NEET 2022: రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులు విడుదల.. టాప్‌ ర్యాంకర్లు విరే..

Published date : 18 Oct 2022 01:35PM

Photo Stories