Skip to main content

High Court: నీట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొననివ్వండి

Persons with Disabilities Quota కింద NET 2022 కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌లో.. అవకాశం ఇవ్వాలని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
High Court
నీట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొననివ్వండి

కాళోజీ వర్సిటీ సహా ప్రతివాదులంతా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. ఒక చేయి ఉన్నవారు MBBSకు అనర్హులన్న National Medical Council (NMC) నిబంధనను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ మెహదీపట్నంకు చెందిన విద్యార్థి ఒమర్‌ సలీమ్‌ అహ్మద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2019లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇచి్చన ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. 2022, అక్టోబర్‌ 4న నీట్‌కు సంబంధించి పిటిషనర్‌ అంగవైకల్యంపై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, సర్‌ జేజే హాస్పిటల్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

చదవండి: NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

నీట్‌–2022లో పీడబ్ల్యూడీ కోటా కింద కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా పిటిషనర్‌కు అవకాశం కల్పిస్తూ.. ఎన్‌ఎంసీ, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించాలని అని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం అక్టోబర్‌ 13న విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. దివ్యాంగుడైన పిటిషనర్‌కు పీడబ్ల్యూడీ కోటా కింద కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కలి్పంచాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది. 

చదవండి: NEET -SS 2021 : సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

Published date : 14 Oct 2022 01:41PM

Photo Stories