Skip to main content

NEET -SS 2021 : సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(ఎన్‌బీఈ).. సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ ఎస్‌ఎస్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 156 ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో అందుబాటులో ఉన్న 2,447 డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(డీఎం), మాస్టర్‌ ఆఫ్‌ చిరూర్గీ(ఎంసీహెచ్‌), డాక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (డీఆర్‌ఎన్‌బీ) సీట్లను భర్తీ చేస్తారు.ఇందుకోసం నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ఎస్‌ఎస్‌) పరీక్షను నవంబర్‌ 13,14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీపై ప్రత్యేక కథనం...
NEET -SS 2021
NEET -SS 2021
  • డీఎం,ఎంసీహెచ్, డీఆర్‌ఎన్‌బీల్లో ప్రవేశాలు
  • దేశంలో 2,447 సూపర్‌ స్పెషాలిటీ సీట్లు

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(ఎన్‌బీఈ).. సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ ఎస్‌ఎస్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 156 ఇన్‌స్టిట్యూట్స్‌ల్లో అందుబాటులో ఉన్న 2,447 డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(డీఎం), మాస్టర్‌ ఆఫ్‌ చిరూర్గీ(ఎంసీహెచ్‌), డాక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (డీఆర్‌ఎన్‌బీ) సీట్లను భర్తీ చేస్తారు.ఇందుకోసం నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ఎస్‌ఎస్‌) పరీక్షను నవంబర్‌ 13,14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. నీట్‌ సూపర్‌ స్పెషాలిటీపై ప్రత్యేక కథనం...

దేశంలో మెడికల్‌ డిగ్రీలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఎంబీబీఎస్‌లో చేరాలంటే పోటీ ఎక్కువ. నీట్‌లో మంచి ర్యాంక్‌ సాధించిన వారికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఐదున్నరేళ్ల ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవారు తర్వాత  పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులైన ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ వంటి కోర్సుల్లో చేరతారు. ఈ పీజీ కోర్సుల తర్వాత స్పెషలైజేషన్‌ చేయాలంటే..సూపర్‌ స్పెషాలిటీ కోర్సులైన డీఎం/ఎంసీహెచ్‌/డీఆర్‌ఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందాలి. అందుకోసం నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌.. ‘నీట్‌ స్పూర్‌ స్పెషాలిటీ’ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. 

అర్హతలు

  • సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాలంటే.. ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ తత్సమాన పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
  • నవంబర్‌ 30, 2021 నాటికి లేదా అంతకుముందు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేసే/చేసిన వారు మాత్రమే నీట్‌ ఎస్‌ఎస్‌–2021కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 
  • దరఖాస్తుదారులు రాష్ట్ర వైద్య మండలి(ఎస్‌ఎంసీ) లేదా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) నుంచి తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. 
  • ఆయా అర్హతలు ఉన్నవారు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ సూపర్‌ స్పెషాలిటీ(నీట్‌–ఎస్‌ఎస్‌)కి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి నిర్ణీత తేదీల్లో పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. 

పరీక్ష విధానం

  • నీట్‌ ఎస్‌ఎస్‌ను కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు–600 మార్కులకు ఉంటాయి. వీటిని రెండున్నర గంటల్లో (150 నిమిషాలు) పూర్తి చేయాలి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. సమాధానం గుర్తించని ప్రశ్నలకు మైనస్‌ మార్కులు ఉండవు. 
  • నీట్‌ ఎస్‌ఎస్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించిన అభ్యర్థులను మాత్రమే ప్రవేశ పరీక్షలో అర్హత పొందినట్లు ప్రకటిస్తారు.
  • 50 పర్సటైల్‌ ఆపై సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు. నీట్‌ ఎస్‌ఎస్‌ అర్హత ఒక సంవత్సరం మాత్రమే అమల్లో ఉంటుంది. 
  • అర్హులైన అభ్యర్థులను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) నిర్వహించే కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. కౌన్సెలింగ్‌లో మొత్తం రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులో అభ్యర్థులు కోర్సులు, కళాశాలను ఎంపిక చేసుకోవాలి. 

ఈ సంస్థల్లో అవకాశం లేదు

  • నీట్‌–ఎస్‌ఎస్‌–2021 ద్వారా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో డీఎం/ఎంసీహెచ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. వీటిలో సాయుధ దళాల మెడికల్‌ సర్వీసెస్‌ సంస్థలు కూడా ఉన్నాయి. 
  • ఎయిమ్స్‌(న్యూఢిల్లీ), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(చండీగఢ్‌), జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్మర్‌– పుదుచ్చేరి), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హన్స్‌–బెంగళూరు), శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ(తిరువనంతపురం) మాత్రం ‘నీట్‌ ఎస్‌ఎస్‌’ పరిధిలోకి రావు. 

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
నీట్‌ ఎస్‌ఎస్‌ 2021 పరీక్ష తేదీ: 2021 నవంబర్‌ 13, 14

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nbe.edu.in

చ‌ద‌వండి: NEET-UG 2021: నీట్‌ రాసారా.. ఇది మీ కోసమే!

Published date : 02 Nov 2021 01:09PM

Photo Stories