Skip to main content

Admission:ఏపీ సీయూలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ (ఏపీ సీయూ) 2022-28 విద్యా సంవత్సరానికి సంబంధించి సర్టిఫికెట్‌, డిప్లామో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Admission
ఏపీ సీయూలో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు (50 సీట్లు), డిప్లామోకోర్సు (50 సీట్లు), మొబైల్‌ జర్నలిజంలో సర్టిఫికెట్‌ కోర్సు (50 సీట్లు), డిజిటల్‌ జర్నలిజంలో డిష్లామో కోర్సు (50 సీట్లు) అందుబాటులో ఉన్నాయని వీసీ పొఫెసర్‌ ఎస్‌.ఎ.కోరి తెలిపారు. సర్టిఫికెట్‌ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు, డిష్లామో కోర్సు కాల వ్యవధి ఏడాది ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిజం కోర్సులో అడ్మిషన్‌ పొందడానికి ప్రెస్‌, మీడియా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ మాత్రమే అర్హులని, ఇప్పటికే సెంట్రల్‌ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సర్డిఫికెట్‌, డిప్లామో కోర్సులను అదనంగా ఏకకాలంలో అభ్యసించవచ్చునని తెలిపారు. సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులకు 50శాతం ఫీజు మినహాయింపు ఉంటుందని, మొబైల్‌ జర్నలిజం సర్టిఫికెట్‌ కోర్సుకు రూ.15 వేలు, డిజిటల్‌ జర్నలిజం డిప్లామో కోర్సు ఫీజు రూ.80 వేలుగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. జనవరి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు వర్శిటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు.

చదవండి:

CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం

Navodaya Exam: ఒక్కసారి ఎంటర్‌ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీ

TISSNET 2023 Notification: అవుతారా.. సామాజిక శాస్త్రవేత్త!

Admissions in PJTSAU: పీజేటీఎస్‌ఏయూ, ఎస్‌కెఎల్‌టీఎస్‌హెచ్‌యూలో బీఎస్సీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

Published date : 16 Jan 2023 03:20PM

Photo Stories