Skip to main content

TISSNET 2023 Notification: అవుతారా.. సామాజిక శాస్త్రవేత్త!

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌.. సంక్షిప్తంగా టిస్‌! సామాజిక ప్రగతికి దోహదపడే సోషల్‌ వర్క్‌ మొదలు.. గవర్నెన్స్, పాలసీ తదితర వినూత్న విభాగాల్లో.. ప్రత్యేక పీజీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న సంస్థ ఇది! టిస్‌ తనకు దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు క్యాంపస్‌ల్లో పీజీ ప్రోగ్రామ్‌ల్లో ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం కల్పిస్తోంది. ఇందుకోసం టిస్‌ నెట్‌–2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది!! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. టిస్‌ ప్రత్యేకతలు, ప్రవేశ ప్రక్రియ వివరాలు, అర్హతలు, పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
tiss net 2023 notification and syllabus
  • టిస్‌నెట్‌–2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
  • ఈ కోర్సులతో ఉపాధి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా

సోషల్‌ ౖసైన్స్‌ కోర్సులు అనగానే టక్కున గుర్తొచ్చే విద్యాసంస్థ.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌). ఈ ఇన్‌స్టిట్యూట్‌ అందించే సోషల్‌ వర్క్, హుమాన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌లు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులను సామాజిక ప్రగతిలో పాలుపంచుకునేలా తీర్చిదిద్దుతారు. 

చ‌ద‌వండి: Admissions in TISS: టిస్‌ నెట్‌-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..

4 క్యాంపస్‌లు.. 60 ప్రోగ్రామ్‌లు

  • టిస్‌కు ముంబై ప్రధాన క్యాంపస్‌తోపాటు తుల్జాపూర్, హైదరాబాద్, గువహటిల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇవి 57 పీజీ ప్రోగ్రామ్‌లు, మూడు పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు ఇలా మొత్తం 60 ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి. 
  • ముంబై క్యాంపస్‌లో పీజీ స్థాయిలో 38 ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. అవి.. ఎంఏ సోషల్‌ వర్క్‌(క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌), ఎంఏ–అప్లైడ్‌ సైకాలజీ(క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌), ఎంఏ–సోషల్‌ వర్క్‌(పబ్లిక్‌ హెల్త్‌), మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, ఎంఏ–సోషల్‌ వర్క్‌(చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌), మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌), మాస్టర్‌ ఆఫ్‌ ‘లా’స్‌(యాక్సెస్‌ టు జస్టిస్‌), ఎంఏ–డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎంఏ–మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్, ఎంఎ/ఎమ్మెస్సీ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌), ఎంఏ/ఎమ్మెస్సీ(అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌), ఎంఏ–ఎడ్యుకేషన్, ఎంఎ–సోషల్‌ వర్క్‌(దళిత్‌ అండ్‌ ట్రైబల్‌ స్టడీస్‌ యాక్షన్‌), ఎంఏ–సోషల్‌ వర్క్‌(డిజేబిలిటీ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌), ఎంఏ–ఆర్గనేజేషన్‌ డెవలప్‌మెంట్, ఛేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్, ఎంఏ/ఎమ్మెస్సీ(రెగ్యులేటరీ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌), ఎంఏ–గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్, మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(సోషల్‌ ఎపిడమాలజీ), ఎంఎ–ఎడ్యుకేషన్‌(ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ), ఎంఏ–సోషల్‌ వర్క్‌ (లైవ్‌లీహుడ్‌ అండ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌), ఎంఏ/ఎమ్మెస్సీ(ఎన్విరాన్‌మెంట్, క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ సస్టెయినబిలిటీ స్టడీస్‌), ఎంఏ–హెచ్‌ఆర్‌ఎం అండ్‌ లేబర్‌ రిలేషన్స్, మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్‌ ఆఫ్‌ యానిమల్‌ అసిస్టెడ్‌ థెరపీ ఇన్‌ కౌన్సెలింగ్, మాస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ స్టడీస్‌ అండ్‌ ప్రాక్టీస్, బీఈడీ–ఎంఈడీ, ఎంఏ–సోషల్‌ వర్క్‌(ఉమెన్‌ సెంటర్డ్‌ ప్రాక్టీస్‌), ఎంఈడీ, మాస్టర్స్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రాక్టీసెస్, ఎంఏ/ఎమ్మెస్సీ(అనలిటిక్స్‌), ఎంఏ–సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌. 
  • తుల్జాపూర్‌ క్యాంపస్‌లో.. సోషల్‌ వర్క్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌లో ఎంఏ, డెవలప్‌మెంట్‌ పాలసీ, ప్లానింగ్‌ అండ్‌ ప్రాక్టీస్‌; సస్టెయినబుల్‌ లైవ్‌లీహుడ్స్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్, సోషల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్, గవర్నెన్స్‌లో ఎంఏ /ఎమ్మెస్సీ కోర్సులున్నాయి.
  • గువహటి క్యాంపస్‌లో.. పబ్లిక్‌ హెల్త్, లేబర్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌; కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌; ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌; లైవ్‌లీహుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌; కౌన్సెలింగ్, పీస్‌ అండ్‌ కన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్‌; సోషియాలజీ అండ్‌ సోషల్‌ ఆంత్రోపాలజీ స్పెషలైజేషన్లతో ఎంఏ సోషల్‌వర్క్‌ ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. 
  • హైదరాబాద్‌ క్యాంపస్‌లో.. పీజీ డిప్లొమా ఇన్‌ సిటీస్‌ అండ్‌ గవర్నెన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, ఎంఏ(సిటీస్‌ అండ్‌ గవర్నెన్స్‌),ఎంఏ(ఉమెన్‌ స్టడీస్‌), ఎంఏ–ఎడ్యుకేషన్, ఎంఏ–రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఎంఏ–పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ గవర్నెన్స్, ఎంఏ–నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ గవర్నెన్స్‌.

చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

అర్హత

బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ప్రోగ్రామ్‌లకు ప్రత్యేక అర్హతలు నిర్దేశించారు.

ప్రవేశాలు ఇలా

  • జాతీయ స్థాయిలో నిర్వహించే టిస్‌–నెట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. తదుపరి దశలో టిస్‌ప్యాట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • టిస్‌–నెట్‌ పరీక్షను మొత్తం మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30 ప్రశ్నలు–30 మార్కులు, మ్యాథమెటిక్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట 40 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. 

తదుపరి దశలో టిస్‌–ప్యాట్‌

టిస్‌–నెట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి.. తదుపరి దశలో ప్రోగ్రామింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(పీఏటీ)ను నిర్వహిస్తారు. ఇది ఆన్‌లైన్‌ విధానంలో 50 మార్కులకు రెండు విభాగాలుగా ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు అనుగుణంగా పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి. టిస్‌ ప్యాట్‌ సెక్షన్‌–ఎలో ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్యాసేజ్‌ ఇచ్చి దానికి సంబంధించి అడిగే మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 30 మార్కులకు సెక్షన్‌–ఎలో పరీక్ష ఉంటుంది. సెక్షన్‌–బిలో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 20. ఇలా మొత్తం 50 మార్కులకు టిస్‌ ప్యాట్‌ను నిర్వహిస్తారు. కొన్ని స్పెషలైజేషన్లకు సెక్షన్‌–ఎలోనే ఎస్సే రైటింగ్, సెక్షన్‌–బిలో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ రాయాల్సి ఉంటుంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

  • ఎంపిక ప్రక్రియలో చివరి, మూడో దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఆయా కోర్సులను అభ్యసించేందుకు అభ్యర్థులకున్న ఆసక్తి, సరితూగే తత్వాన్ని పరీక్షిస్తారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇందులో అభ్యర్థుల నైపుణ్యాలు, ఆసక్తి, సన్నద్ధత తదితర అంశాలను పరిశీలిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధిస్తే సీటు ఖరారు చేస్తారు.

వెయిటేజీ విధానం

  • మొత్తం మూడు దశలుగా ఉండే ఎంపిక ప్రక్రియలో భాగంగా.. తుది విజేతలను ఖరారు చేసేందుకు ఆయా దశల్లో చూపిన ప్రతిభకు వెయిటేజీ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. 
  • టిస్‌–నెట్‌కు 50 శాతం వెయిటేజీ, ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌కు 20 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30శాతం వెయిటేజీ కల్పిస్తున్నారు.
  • హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్‌; ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజ్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెండో దశలో ప్రోగ్రామింగ్‌ ఆప్టిట్యూడ్‌కు బదులు ప్రత్యేకంగా నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(టిస్‌ మ్యాట్‌)కు హాజరవ్వాల్సి ఉంటుంది. 
  • 45 నిమిషాల వ్యవధిలో ఉండే టిస్‌ మ్యాట్‌లో.. మూడు విభాగాల్లో (కాంప్రహెన్షన్‌ – 10 ప్రశ్నలు, బిజినెస్‌ అవేర్‌నెస్‌–10 ప్రశ్నలు, మేనేజ్‌మెంట్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ –15 ప్రశ్నలు) పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. దీంతోపాటు డిస్క్రిప్టివ్‌ రైటింగ్‌ పేరుతో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. దీనికి 16 మార్కులు కేటాయించారు. ఇలా మొత్తం 50 మార్కులకు టిస్‌–మ్యాట్‌ ఉంటుంది.

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది 

ఉజ్వల కెరీర్స్‌

టిస్‌లో పీజీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌తోనే కెరీర్‌ అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్‌ కొలువులు సొంతమవుతున్నాయి. యూనిసెఫ్, యూఎన్‌డీపీ వంటి ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాలతోపాటు సేవ్‌ చిల్డ్రన్, ప్రదాన్‌ వంటి సామాజిక సేవా సంస్థల్లో కొలువులు లభిస్తున్నాయి. వీటితోపాటు రిలయన్స్‌ ఫౌండేషన్, కేపీఎంజీ, టాటా క్లాస్‌ ఎడ్జ్, పీడబ్ల్యూసీ, ఉబెర్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు సైతం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌లో పాల్గొని ఆఫర్లు ఖరారు చేస్తున్నాయి. సగటున రూ.5 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

సిలబస్‌ అంశాలు ఇవే

  • ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ: అభ్యర్థుల్లోని ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరిశీలించే ఈ విభాగంలో రాణించడానికి సెంటెన్స్‌ కరెక్షన్, అనాలజీస్, సినానిమ్స్, యాంటానిమ్స్, గ్రామర్, వెర్బల్‌ రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.
  • మ్యాథమెటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌: ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించడానికి అర్థమెటిక్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. 
  • జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగానికి సంబంధించి రాజకీయాలు, సోషల్‌ స్టడీస్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్‌ అండ్‌ కల్చర్, భారత చరిత్ర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అభ్యర్థులు పదో తరగతి స్థాయి పుస్తకాలను అభ్యసనం చేయడం ద్వారా అవగాహన పొందొచ్చు.
  • జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి సమకాలీన అంశాలు, 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ సోషల్‌ పుస్తకాలను అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

టిస్‌ –నెట్‌–2023 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2023, జనవరి 15
  • టిస్‌–నెట్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీలు: 2023 జనవరి 28– 2023 ఫిబ్రవరి 28.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌
  • వెబ్‌సైట్‌: https://admissions.tiss.edu
Published date : 03 Jan 2023 05:43PM

Photo Stories