Skip to main content

MEO-1 & MEO-2: ఎంఈఓ–1, 2 అకడమిక్‌.. అడ్మినిస్ట్రేషన్‌ విధులు ఇలా..

విద్యార్థులు చ‌క్క‌గా చ‌దువుకుంటే బంగారు భ‌విష్య‌త్తు సొంత‌మ‌వుతుంది. కుటుంబ జీవ‌న స్థితిగ‌తులు మారుతాయి.
MEO-1, 2 Academic Administration Duties

స‌మాజోన్న‌తి జ‌రుగుతుంది. విద్యార్థుల చ‌దువులే రాష్ట్రానికి అస‌లైన పెట్టుబ‌డిగా భావిస్తూ.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలుగా నూత‌న విద్యాసంస్థ‌లు అమ‌లుచేస్తోంది. విద్యారంగ అభివ‌`ద్ధికి రూ.కోట్లు ఖ‌ర్చుచేస్తోంది. పేదకుటుంబాల పిల్ల‌లు చ‌క్క‌గా చ‌దువుకునేందుకు విలుగా ఊరు బ‌డిని ముస్తాబు చేసింది. వారిలో అభ్య‌స‌న సామ‌ర్త్యాలు పెంపొందించేలా చ‌దువు ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తోంది. వీటి ప‌ర్య‌వేక్ష‌ణ‌కు మండ‌లానికి ఇద్ద‌రు విద్యాశాఖ అధికారుల‌ను నియ‌మించింది. చ‌దువుల యజ్ఞాన్ని నిర్వ‌ఘ్నంగా కొన‌సాగిస్తూ.. ప్రాథ‌మిక ద‌శ‌లోనే విద్యార్థుల భ‌విత‌కు గ‌ట్టి పునాదిని వేస్తోంది. 

మండ‌ల విద్యాశాఖ అధికారుల సంఖ్య‌
జిల్లా                            మండ‌లాలు     ఎంఈఓ–1      ఎంఈఓ–2
పార్వ‌తీపురం మ‌న్యం      15                       15               15
విజ‌య‌న‌గరం జిల్లా          27                      27                27 

Education News: పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం.. మొదలైన వంద రోజుల ప్రణాళిక.. ఎక్క‌డంటే..

నిరంతర పర్యవేక్షణ 
సర్కారు బడుల బాగుకోసం వివిధ పథకాల కింద ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇవి సత్ఫలితాలిచ్చేలా పర్యవేక్షణకు గతంలో ఉన్న ఒక ఎంఈఓ స్థానంలో మరో ఎంఈఓను నియమించింది. నాడు–నేడు పను ల నుంచి పాఠశాలల భద్రత వరకు.. ఉపాధ్యాయులకు విద్యాసంబంధ శిక్షణ తరగతుల నిర్వహణ నుంచి ప్రతి విద్యార్థి మెరుగైన అభ్య సనా సామర్థ్యాలు సాగించేవరకు నిశిత పరిశీల న జరుగుతోంది. అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతో విద్యాప్రణాళికలు సమర్ధంగా అమలవుతున్నాయి. విద్యార్థులు చక్కగా చదువులు సాగిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ తమ బతుకులు మార్చుకునే దిశగా సరస్వతీ నిలయాల్లో చదువుయజ్ఞం సాగిస్తున్నారు.

ఎంఈఓ–1 అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ విధులు ఇలా..
● పాఠశాలల పరిశీలన, తనిఖీ
● విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతుల నిర్వహణ
● విద్యార్థుల్లో సృజనకు పదునుపెట్టేలా విద్యాకార్యక్రమాల అమలు చేయడం, విద్యార్థులను ఫీల్డ్‌ విజిట్‌కు తీసుకెళ్లడం.

● అభ్యసనా సామర్థ్యాల పర్యవేక్షణ, విద్యాప్రమాణాలు పెంపొందించేలా విద్యాప్రణాళికలు అమలుచేయడం. నాస్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ సర్వే), శ్లాస్‌ (స్టూడెంట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే) నిర్వహణ
● మండలంలోని పాఠశాలల అనుమతులపై ఆరా తీయడం
● బోధన చక్కగా సాగేలా ఉపాధ్యాయుల నియామకం, సర్దుబాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం.
● ఉపాధ్యాయుల వృత్తిపర సమస్యలను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం.

Andhra Pradesh: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం

ఎంఈఓ–2 అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ విధులు ఇలా..
● ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసనకు వీలుగా పాఠశాలలను ముస్తాబుచేయడం, ఆ వివరాలు నమోదు చేయడం
● బడిబయట పిల్లల గుర్తింపు, బడిలో చేర్పించే ప్రక్రియ పరిశీలన
● వృత్తి విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల ఆసక్తి గమనించడం. బోధన ప్రక్రియలో చేర్చడం
● విద్యార్థుల ప్రగతినివేదికలు పరిశీలించడం
● విజ్ఞాన ప్రదర్శనల నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వైపు విద్యార్థులను ప్రోత్సహించడం.

● నాడు–నేడు పనుల పరిశీలన, డిజిటల్‌ బోధన పరికరాలు సమకూర్చడం, ప్రభుత్వం సరఫరా చేస్తున్న జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులందరికీ అందేలా ప్రత్యేక పర్యవేక్షణ
● పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం (జగనన్న గోరుముద్ద) మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడడం. విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అనువుగా పాఠశాల వాతావరణం తీర్చిదిద్దడం
● ‘అమ్మఒడి’ పథకం అర్హులైన విద్యార్థులందరికీ అందేలా పర్యవేక్షణ
● పాఠశాలలు, విద్యార్థులకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం, బాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతాపరమైన అంశాలపై అవగాహన సదస్సుల నిర్వహణ.

Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..

ప్రాథమిక విద్య బలోపేతం 
ప్రాథమిక విద్యపై ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ బాగుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో బోధన, నిర్వహణపై పెంచిన పర్యవేక్షణ వ్యవస్థ వల్ల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అధికారుల తనిఖీలు, ఉపాధ్యాయుల ఉత్తమ బోధనతో 1, 2, 3వ తరగతి విద్యార్థుల్లో అభ్యసన వికాసం కనిపిస్తోంది. 4, 5 తరగతుల్లో పెంచిన పాఠ్యాంశాల స్థాయి వల్ల కూడా విద్యార్థుల్లో చదువు సామర్థ్యాలు పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం రెండేళ్లపాటు విద్యార్థుల చదువుపై పడింది. ప్రస్తుతం చదువుతున్న 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాల్సిన అవసరం ఉంది.  – అల్లు వెంకటరమణ, ఎంఈఓ–2, బొండపల్లి మండలం

క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం
మండలానికి ఇద్దరు ఎంఈఓల నియామకం ఎంతో ఉపయోగకరం. దీనివల్ల క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ చేయగలుగుతున్నాం. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, విద్యాబోధన, పాఠశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక అధికారి అడ్మినిస్ట్రేషన్‌, ఇంకో అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. విద్యావ్యవస్థలో పూర్తిస్థాయి పర్యవేక్షణ వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. – విమలాకుమారి, ఎంఈఓ –1, పార్వతీపురం మండలం 

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు
ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక మార్పులను తీసుకువచ్చింది. ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓల నియామకం ఓ విప్లవాత్మక మార్పు. ఇద్దరు ఎంఈఓలు పాఠశాలల పర్యవేక్షణలో నిరంతరం ఉంటున్నారు. దీనివల్ల పాఠశాలల అబివృద్ధితోపాటు విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. విద్యార్థులకు మేలు జరుగుతోంది. – ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

Mega DSc Notification : త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేలా..

Published date : 15 Dec 2023 04:24PM

Photo Stories