Skip to main content

Telangana Mega DSc Notification : త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి కొన్ని వేల మంది నిరుద్యోగులు వేచిచూస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో అదిగో నోటిఫికేష‌న్‌.. ఇదిగో నోటిఫికేష‌న్ అని కాల‌యాప‌న చేసి.. చివ‌రికి మెండిచేయ్యి చూపింది. ఇప్పుడు తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. కూడా త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామంటున్నారు.
 Telangana government teacher jobs.  Telangana Mega DSc Notification Details  Mega DSC notification in Telangana

అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల తేదీని కూడా పొందుప‌రిచింది. ఈ నోటిఫికేష‌న్ కోసం డీఎస్సీ అభ్య‌ర్థులు ఎదురుచూస్తున్నారు.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో.. 

professor kodandaram

ఈ నేప‌థ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని వీలైనంత త్వరగా అమలు అయ్యోలా కృషి చేస్తానని ప్రొ. కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ సాధన పేరిట హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్‌లో డిసెంబ‌ర్ 13వ తేదీన‌(బుధవారం) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. 

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయ్‌..
గ‌త ప్ర‌భుత్వం పదేళ్లలో విద్యారంగం భ్రష్టు పట్టిందని, దాన్ని బలోపేతానికి అందరూ పాటు పడాలని ప్రొ. కోదండరాం కోరారు. గతంలో మూసివేసిన 6 వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే కనీసం 6 వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని, ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను 20 వేలకు పెంచి… అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని, అందుకు ఉపాధ్యాయ పదోన్నతులతో ముడిపెట్టవద్దని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

తెలంగాణ‌లో 20,740 టీచర్ ఉద్యోగాలు.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

తెలంగాణ‌ రాష్ట్రంలో ప్ర‌భుత్వ టీచర్ ఉద్యోగాలు ఖాళీలు.. భ‌ర్తీపై తెలంగాణ‌లో కొత్తగా వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీసింది. గ‌త ప్రభుత్వంలో నిలిచిపోయిన నియామకాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాకబు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్‌ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు.

telangana government teacher jobs news telugu  Updates on Teacher Appointments in Telangana    Telangana Chief Secretary Receives Report on Teacher Vacancies

దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్‌ వల్ల నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

తెలంగాణ డీఎస్సీ రీ షెడ్యూల్‌.. ? 
తెలంగాణ ఎన్నికల ముందు 5,089 టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. రోస్టర్‌ విధానాన్ని స్పష్టం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఆగిపోయిన డీఎస్సీని ముందుకు తీసుకెళ్ళడమా? కొత్త షెడ్యూల్‌ ఇవ్వడమా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోస్టర్‌ విధానం వెల్లడించిన తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి. స్థానికేతరులకూ కేవలం 15 శాతమే అర్హత ఉండటంతో డీఎస్సీపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లోనే కొన్ని పో స్టులు కలపాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్‌ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి.

20,740 ఉద్యోగాల‌కు..
విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేస్తారు.స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు తెలిపారు.

                                              sakshi education whatsapp channel image link

Published date : 14 Dec 2023 01:43PM

Photo Stories