Education News: విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టు సాధించాలి..
Sakshi Education
చదువులో వెనుకబడిన విద్యార్థులు భాషపై పట్టు సాధించాలని డీఈఓ రామారావు అన్నారు.
![Students should master the language](/sites/default/files/images/2023/12/14/deo-ramarao-1702537818.jpg)
డిసెంబర్ 12న కురవి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో మహబూబాబాద్, కురవి, సీరోలు మండలాలకు సంబంధించి యూపీ లెవల్ తెలుగు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. చదవడం, రాయడం అనే అభ్యసనాలను విధిగా పిల్లలతో చేయించి చదువులో రాణించేలా తయారు చేసే బాధ్యత ప్రతీ ఉపాధ్యాయుడిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం ఎండీ వాహిద్, కురవి, సీరోలు మండలాల ఎంఎన్‌ఓలు బాలాజీ, లచ్చిరాం, డీఆర్‌జీలు గన్నోజు ప్రసాద్, తండా హరీశ్‌గౌడ్, తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Free Employment Training: 15 నుంచి నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ
Published date : 14 Dec 2023 12:40PM