Skip to main content

Free Employment Training: 15 నుంచి నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

అనకాపల్లిటౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్‌(సీడప్‌)లో భాగంగా దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా నిరుద్యోగ యువతకు డిసెంబ‌ర్ 15 నుంచి నాలుగు మాసాలపాటు వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారిణి కె.కల్యాణి డిసెంబ‌ర్ 11న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Employment training for unemployed youth from 15

పదోతరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: ABK Prasad: ఇంకా ఎందుకీ విదేశీ మొగ్గు?

శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, శిక్షణ అనంతరం ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు 89785 33105, 70132 28982 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

Published date : 13 Dec 2023 10:53AM

Photo Stories