Skip to main content

Medical College: కళాశాలలో అడ్మిషన్ల సందడి

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం నూతన మెడికల్‌ కళాశాలలో అడ్మిషన్ల సందడి మొదలైంది. ఆగ‌స్టు 22న‌ తొలి అడ్మిషన్‌ జరగగా ఇద్దరు విద్యార్థులు చేరారు.
Medical College
కళాశాలలో అడ్మిషన్ల సందడి

 ఆగ‌స్టు 23న‌ కూడా కళాశాలలో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వచ్చారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రావటంతో కళాశాల అడ్మిషన్‌ విభాగంలో సందడి నెలకొంది. నలుగురు విద్యార్థులు చేరటంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 6కు చేరింది.

చదవండి: Admission: రాజస్థాన్‌కు చెందిన భరత్‌ పారిక్‌ తొలి అడ్మిషన్‌

నేషనల్‌ కోటాలో 15 సీట్లు కేటాయించగా రెండు, మూడు రోజుల్లో ఆ కోటా సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి సీట్లకు కూడా అడ్మిషన్లు నిర్వహించనున్నారు. త్వరలోనే కేటాయించిన 100 సీట్లు భర్తీ అవుతాయని కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావు పేర్కొన్నారు.

చదవండి: Free Medical Camp: విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

Published date : 24 Aug 2023 03:03PM

Photo Stories