Admission: రాజస్థాన్‌కు చెందిన భరత్ పారిక్ తొలి అడ్మిషన్
నీట్ జాతీయ స్థాయిలో 21,875 ర్యాంకు సాధించిన పారిక్ నేషనల్ కోటాలో సీటు పొందారు. అలాగే రాజస్థాన్‌కే చెందిన విద్యార్థిని కూడా గరీమా గౌతమ్(21,728 ర్యాంక్) కూడా ప్రవేశం పొందింది. గత నెల నుండి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభించగా ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఆప్షన్లు పెట్టుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఆగస్టు 22న నలుగురు విద్యార్థులు రాగా ఇద్దరు ప్రవేశాలు పొందారు. ఖమ్మం మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా అందులో 15 సీట్లు జాతీయ స్ధాయిలో, మిగతా 85 సీట్లు రాష్ట్ర స్ధాయి కోటాకు కేటాయించారు.
చదవండి: Free Medical Camp: విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
సిద్ధమైన తరగతి గదులు, వసతి భవనాలు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత ఏడాది ఖమ్మంకు కళాశాలను మంజూరు చేసిన విషయం విదితమే. రూ.166 కోట్లు కేటాయించగా ఖమ్మం ఆస్పత్రి, ఆర్‌అండ్‌బీ, పాత కలెక్టరేట్, డీఎంహెచ్‌ఓ కార్యాలయంతో కలుపుకొని 30 ఎకరాల స్థలం సమకూర్చారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు పలుమార్లు పరిశీలించి అనుమతులు జారీ చేయడంతో ఆధునికీకరణ పనులు ప్రారంభించారు.
ప్రస్తుతానికి పాత కలెక్టరేట్‌లో కళాశాల తరగతి గదులు, ల్యాబ్‌లు, ఆడిటోరియం, సిబ్బంది గదులే కాక ఆర్‌అండ్‌బీ భవనంలో బాలికలకు, పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో బాలురకు హాస్టళ్లు సిద్ధం చేశారు. వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు చేరుతారని కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు చెప్పారు. కాగా, కళాశాలను వర్చువల్‌గా సీఎం కేసీఆర్ వచ్చేనెల 1వ తేదీన ప్రారంభించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాక అక్టోబర్ మొదటి వారంలో తరగతులు మొదలవుతాయి. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసో సియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మినిస్టీరియల్ సిబ్బందిని నియమించారు.