Free Medical Camp: విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
Sakshi Education
కొత్తపల్లి: రాష్ట్రీయ బాల స్వస్తీయ (ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 22న కరీంనగర్ టీం ఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
విద్యార్థుల్లో పౌష్టికాహార, పుట్టుకతో వచ్చే, ఎదుగుదలలో లోపాలు వంటి వాటిపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయించాలని, పౌష్టికాహారం అందించాలని, వ్యాధులు సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. హెచ్‌ఎం అశోక్‌రెడ్డి, వైద్యులు హబీబొద్దీన్, సరిత ముదావత్, శైలేంద్ర, ఫార్మాసిస్ట్ పావని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Teachers: 176 మంది టీచర్ల సర్దుబాటు
Chandrayaan 3 Landing: ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు
Best English Teachers Awards: ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయులకు అవార్డులు
Published date : 23 Aug 2023 01:37PM