Chandrayaan 3 Landing: ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు
సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు పాఠశాలల్లో వీక్షించే ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈవోలకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాటు చేస్తున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 22న చంద్రుడిపై అడుగుపెట్టనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్ పాదమోపనుంది.
చదవండి: Chandrayaan-3 Live Updates: చంద్రుడిపై చంద్రయాన్–3 అడుగు నేడే?
11 నిమిషాల పాటు రఫ్ బ్రేకింగ్ దశ కొనసాగనుంది. ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్వయంగా అన్వేషించనుంది. అన్నీ అనుకూలిస్తే రెండు ఇంజిన్ల సాయంతో ల్యాండింగ్ కానుంది. సాయంత్రం 5.20 గంటల నుంచి ఇస్రో లైవ్ ఇవ్వనుంది. ల్యాండర్ సేఫ్‌గా దిగితే.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని గడించనుంది. ఈ కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే ఉండటంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
చదవండి: Chandrayaan-3: చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్–3