Chandrayaan-3: చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్–3
అందులోని ఇంధనాన్ని ఆదివారం వేకువజామున 2 గంటలకు స్వల్పంగా మండించి కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను రెండోసారి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి 25x134 కిలోమీటర్లు ఎత్తుకు అంటే చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. మొదటి విడతలో 113 కిలోమీటర్ల దూరాన్ని 25 కిలోమీటర్లకు, 157 కిలోమీటర్ల దూరాన్ని 134 కిలోమీటర్ల తగ్గించి చంద్రయాన్–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా తీసుకొచ్చారు.
Chandrayaan-3 Moon Images: చంద్రుని ఛాయాచిత్రాలు
ల్యాండర్ మాడ్యూల్ ఆరోగ్యకరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంవోఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) కేంద్రాల్లో శాస్త్రవేత్తలు 23న సాయంత్రం 5.37 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌లో ఉన్న ఇంధనాన్ని స్వల్పంగా మండించి 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దాదాపు 37 నిమిషాల పాటు జరగనున్న ఈ ఆపరేషన్ అత్యంత కీలకం కానుంది.