Skip to main content

25% Seats for Poor Students : 25 శాతం పేద‌ల‌కే.. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచే ఈ చ‌ట్టం అమ‌లు..!!

రాష్ట్రంలోని ప్రతీ ప్రైవేటు పాఠ‌శాల‌లో పేద విద్యార్థుల‌కు 25 శాతం సీట్ల‌ను కేటాయించాల్సి ఉంది.
25 percent free seats at private schools for poor students  25 percent seat allocation for poor students in private schools, a policy implemented in Telangana

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని ప్రతీ ప్రైవేటు పాఠ‌శాల‌లో పేద విద్యార్థుల‌కు 25 శాతం సీట్ల‌ను కేటాయించాల్సి ఉంది. ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లోని పాఠ‌శాల‌ల్లో ఈ విధానాన్ని అమ‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వ‌చ్చే విద్యాసంవ‌త్సరం అమ‌లు కానుంది. అయితే, ఈ సీట్ల కేటాయింపు విధానాన్ని 2009లో దేశ‌వ్యాప్తంగా తీసుకొచ్చిన చ‌ట్టం ఇది. 

విద్యాహ‌క్కు చ‌ట్టం..

2009లో విద్యాహ‌క్కు చ‌ట్టంలో సెక్షన్12 (1)సీ ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేసిన‌ప్ప‌టికి, తెలంగాణ స‌హా ఆరు రాష్ట్రాల్లో ఇంత‌వ‌ర‌కు ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నేలేదు. మిగిలిన రాష్ట్రాలు కొంతమేర అమలు చేస్తున్నాయి.

New Sainik Schools: 100 సైనిక్‌ స్కూళ్ల ఏర్పాటు.. ప్రతి జిల్లా.. ప్రతి రీజియన్‌లో..

ఇప్ప‌టికే, ఈ చ‌ట్టం అమల్లోకి వచ్చి కొన్ని సంవ‌త్స‌రాలు గడుస్తున్నాప్ప‌టికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అమలు చేయకపోవడంతో ఆయా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోంది. వెంటనే అమ‌లు చేయాల‌ని ఆదేశాల‌ను జారీ చేస్తోంది. ప్ర‌తీ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠ‌శాల‌లో ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాయి.

11,500 పాఠ‌శాల‌లు..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా కేంద్రం నుంచి వ‌స్తున్న ఒత్తిడి కార‌ణంగా వ‌చ్చే ఏడాది నుంచి విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నుంది. దీంతో, ప్ర‌తీ ప్రైవేటు పాఠ‌శాల‌లో పేద విద్యార్థుల‌కు 25 శాతం వ‌ర‌కు సీట్లు కేటాయింపు ఉంటుంది. అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా 11,500 ప్రైవేటు పాఠ‌శాల‌లు ఉన్నాయి. ఈ పాఠ‌శాల‌ల్లో ప్ర‌భుత్వం 25 శాతం సీట్ల‌ను కేటాయించేందుకు ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇదిలా ఉంటే, విద్యాహక్కు చట్టం అమలు కమిటీలోని కొన్ని అంశాలను సవరణ చేయాలని ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే విద్యాహక్కు చట్టం అమలు కమిటీ ఈ విష‌యంపై సమావేశం కానుంది.

No Hall Tickets No Exam : హాల్‌టికెట్లు అంద‌లేదు.. ప‌రీక్ష రాయ‌లేదు.. నిల‌దీసిన త‌ల్లిండ్రులు

భారీ భారం..

విద్యాహ‌క్కు చట్టంపై రెండు, మూడు ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ విద్యావిధానం అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గే అవ‌కాశాలు ఎక్కువే ఉన్నాయ‌ని విద్యావేత్తలు విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, సర్కారుపైనా కూడా భారీగా భారం పడే అవకాశం లేక‌పోలేదు. అయితే, కర్నాటకలో అమల్లో ఉన్నట్టు విద్యార్థి చదివే చోటకు దగ్గరలో సర్కారు బడి లేకుంటే దీనిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇలా జ‌రిగితే, ప్ర‌భుత్వంపై ప్ర‌భావం గ‌ట్టిగానే ఉంటుంది.

ఫీజులు ఎలా..

ఈ లెక్కన తొలి ఏడాది సుమారు 10 వేల నుంచి 15 వేల మందికే ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, ఫీజులను ఎలా నిర్ణయించాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లల్లో వసూలు చేస్తున్న ఫీజు గానీ, ప్రభుత్వం ఒక స్టూడెంట్‌పై ఖర్చు చేసే యావరేజీలో ఏది తక్కువగా ఉంటే దానిని అమలు ఫీజుగా నిర్ణయించాలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలో ఉంది. దీంతో దీనిని అమలు చేయలా.. ఇందులో ఏమైనా మార్పులు చేయాలా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. వీటిపై త్వరలో సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Sainik Schools : మ‌రో 100 సైనిక్ స్కూళ్లు.. మంత్రి వివ‌రణ‌..

Published date : 23 Jan 2025 03:34PM

Photo Stories