Best English Teachers Awards: ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయులకు అవార్డులు
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఇంగ్లిష్ బోధన నైపుణ్యాలు ఉన్న ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించినట్లు డీఈఓ సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న ఉత్తమ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు.
ఇంగ్లిష్‌లో బోధన నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కేటగిరి కింద సత్కరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అవార్డులకు ఈనెల 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో https://centa.org/events/ap-centa-tq లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Published date : 23 Aug 2023 11:33AM