Teachers: 176 మంది టీచర్ల సర్దుబాటు
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో మిగులుబాటుగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే సూచన మేరకు జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటులో పలుకుబడి, పైరవీలకే అ ధికారులు పెద్దపీట వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన విద్యాశాఖ అధికా రులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి: Best English Teachers Awards: ఉత్తమ ఆంగ్ల ఉపాధ్యాయులకు అవార్డులు
ఒక పాఠశాలలో జూనియర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా సీనియర్లకు స్థానచలనం కల్పించడం, ఉపాధ్యాయులు ప నిచేస్తున్న మండలంలోనే సమీప పాఠశాలలోనే స ర్దుబాటు చేయాల్సిన అధికారులు పక్క మండలాల్లోకి, జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు ఇష్టారాజ్యంగా సర్దుబాటు చేసినట్లు సమాచారం. విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, జూనియర్లను కాదని సీనియర్లను సర్దుబాటు చేస్తూ రాజకీయ పలుకుబడికి పెద్దపీట వేస్తూ తమకు అనుకూలమైన చోటుకి సర్దుబాటు చేయించుకొని విద్యాహక్కు చట్టాన్ని తూట్లు పొడిచినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తప్పుల తడకగా సాగిన ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారాన్ని తక్షణమే సవరించాలని లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇష్టరాజ్యంగా సాగిన పలుకుబడి సర్దుబాటు వ్యవహారాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌ను కలిసి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు.
చదవండి: Illegal Transfers of Teachers: తెలంగాణ లో ఉపాధ్యాయ అక్రమ బదిలీలు