వెయిట్ లిఫ్టింగ్‌లో కేజీబీవీ విద్యార్థినులకు పతకాలు
Sakshi Education
జరుగుమల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అండర్–17, అండర్–19 సంవత్సరాల బాలికల విభాగంలో పోటీలు నవంబర్ 23 నుంచి 25 వ తేదీ వరకు కర్నూలులో జరిగాయి.
ఈ పోటీల్లో మండల పరిధిలోని కె.బిట్రగుంట కేజీబీవీ నుంచి 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 71 కిలోల విభాగంలో ఎం.పూర్ణిమ బంగారు పతకం సాధించింది. 45 కిలోల విభాగంలో కె.సిరివెన్నెల కాంస్య పతకం, 49 కిలోల విభాగంలో కె.దీప్తి కాంస్య పతకం, 64 కిలోల విభాగంలో ఎన్.షైనీ రజిత పతకం సాధించారు.
చదవండి: Sports in Andhra Pradesh: రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు కై వసం
పతకాలు సాధించిన క్రీడాకారుణులను కేజీబీవీ ప్రిన్సిపల్ నాదెండ్ల స్రవంతి పీఈటీ బి.హెప్సీబా అభినందించారు. బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి ఎం.పూర్ణిమ డిసెంబరు 25 నుంచి 30 వ తేదీ వరకు రాజస్థాన్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ స్రవంతి తెలిపారు.
Published date : 29 Nov 2023 11:34AM
Tags
- KGBV Girl Students
- Weightlifting
- Andhra Pradesh
- M Purnima
- AP KGBV
- WeightliftingCompetition
- SchoolGames
- Under17Girls
- Kurnool
- YouthSports
- Championship
- Strength and Determination
- India
- SchoolGamesFederation
- IndianYouthSports
- U17Weightlifting
- U19Weightlifting
- Gadsumalli
- sakshi education sports news in telugu
- sports news in telugu