Skip to main content

Sports in Andhra Pradesh: రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు కై వసం

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): గరివిడి మండలంలోని కోనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ, ఫుట్‌బాల్‌ క్రీడాంశాల్లో సత్తాచాటి పతకాలు సాధించారు.
Victorious Konur ZP High School Students Excel in State Kabaddi and Football Competitions, Sports in Andhra Pradesh, Konur ZP High School Kabaddi Team Celebrates State Victory,

ఈనెల 4,5,6 తేదీల్లో కర్నూలు జిల్లాలో అండర్‌–17 విభాగంలో జరిగిన ఫుట్‌బాల్‌ పోటీల్లో పి.తేజ ద్వితీయస్థానం సాధించి సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. అలాగే ఈనెల 18,19,20 తేదీల్లో కడప జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో అండర్‌–14 విభాగంలో సీహెచ్‌.జశ్వంత్‌,ఎ.యమున తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్‌ మెడల్స్‌ గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న మరికొంత మంది విద్యార్ధులను హెచ్‌ఎం.టీవీజీకే మూర్తి, పి.విజయలక్ష్మి, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

చ‌ద‌వండి: School Games Federation: జెడ్పీ విద్యార్థినికి కాంస్య పతకం

Published date : 25 Nov 2023 05:33PM

Photo Stories