Skip to main content

School Games Federation: జెడ్పీ విద్యార్థినికి కాంస్య పతకం

నాగాయలంక: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20 వరకు అన్నమయ్య జిల్లా చిట్వేలు జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ విద్యార్థిని నాయుడు జ్యోతికి కాంస్య పతకం, మెరిట్‌ సర్టిఫికెట్‌ లభించింది.
Bronze medalist Naidu Jyoti from Nagayalanka ZP High School Plus, NaiduJyotiState Level Kabaddi Competition, Naidu Jyoti with bronze medal and merit certificate at state-level kabaddi competition,

రాష్ట్ర స్థాయి కబడ్డీలో కాంస్య పతకం సాధించిన కృష్ణా జిల్లా జట్టుకు జ్యోతి ప్రాతినిధ్యం వహించిందని పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం వనమా రామకృష్ణ శుక్రవారం తెలిపారు. విద్యార్థిని జ్యోతిని, పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్లు గాజుల లక్ష్మీప్రసాద్‌, కోసూరు పూర్ణచంద్రరావును స్కూల్‌ స్టాఫ్‌ అభినందించారు.

చ‌ద‌వండి: Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల గుర్తింపు పెంపు హర్షణీయం

వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌గా కేబీఎన్‌
వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాల వెయిట్‌ లిఫ్టింగ్‌లో కేబీఎన్‌ కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచి చాంపియన్‌షిప్‌ను సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. నారాయణరావు తెలిపారు. పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాల వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, బెస్ట్‌ ఫిజిక్‌ పోటీలు ఇటీవల జాకీర్‌హుసేన్‌ కళాశాల ఆవరణలో జరిగినట్లు పేర్కొన్నారు. అందులో తమ కళాశాల మహిళా లిఫ్టర్లు వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌, పవర్‌ లిఫ్టింగ్‌లో ద్వితీయ స్థానంతో పాటు పవర్‌ లిఫ్టింగ్‌లో కృష్ణా వర్సిటీ స్ట్రాంగ్‌ మెన్‌ అవార్డును భరత్‌ కుమార్‌ సాధించినట్లు తెలిపారు. బెస్ట్‌ ఫిజిక్‌ పోటీలలో తమ విద్యార్థులు ఆరు గోల్డ్‌ మెడల్స్‌, ఒక సిల్వర్‌, బ్రాంజ్‌ ఒకటి సాధించారని పేర్కొన్నారు. అలాగే మహిళా విభాగంలో పవర్‌ లిఫ్టింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ కలిపి ఆరు గోల్డ్‌ మెడల్స్‌, రెండు సిల్వర్‌ మెడల్స్‌, నాలుగు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించి కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో తమ కళాశాల సత్తా చాటారని వివరించారు. త్వరలో దక్షిణ, పడమర రాష్ట్రాల అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీలకు తమ కళాశాల నుంచి ఎన్‌. స్వప్న, వి. రక్షిత, పి. భరత్‌ కుమార్‌ ఎంపిక అయ్యారని తెలిపారు. విద్యార్థులతో పాటు పీడీ డి. హేమచంద్రరావును కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి. శేషయ్య, టి. శ్రీనివాసులు అభినందించారు.

Published date : 25 Nov 2023 01:54PM

Photo Stories