Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..
17 ఏళ్ల వయస్సులోనే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో వరల్డ్ చాంపియన్‌షిప్ చాలెంజర్‌గా నిలిచే ఘనత సాధించాడు.
ఈ టోర్నీలో 14 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి, చివరి రౌండ్‌లో అమెరికాకు చెందిన హికారు నకామురాతో డ్రా గేమ్ ఆడిన గుకేశ్, టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టోర్నీ చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి టీనేజర్‌గానూ గుకేశ్ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు.
ఈ విజయంతో, వచ్చే ఏడాది జరగనున్న చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడే అవకాశం గుకేశ్‌కు లభించింది. ఈ మెగా ఈవెంట్లో చైనాకు చెందిన డింగ్ లారెన్‌తో గుకేశ్ తలపడనున్నాడు.
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ చరిత్రలో నిలిచాడు. 2014లో విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనత సాధించాడు.
Chess Tournament: చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో హంపి, వైశాలి విజయం
గుకేశ్ విజయానికి భారతదేశం అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యువ గ్రాండ్‌మాస్టర్ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తూ.. భారతదేశ ఖ్యాతిని మరింత పెంచుతాడని అందరూ ఆశిస్తున్నారు.
Tags
- Gukesh D
- Candidates 2024
- Chess
- youngest World Championship
- Dommaraju Gukesh
- Candidates Chess 2024
- World Championship
- Hikaru Nakamura
- Sakshi Education News
- SakshiEducationUpdates
- India
- Grandmaster
- DommarajuGukesh
- History
- performance
- CandidatesChessTournament
- WorldChampionshipChallenger
- sakshieducation latest updates