ESCI: మూడు పీజీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ మేరకు ‘ఎస్కీ’డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు సెప్టెంబర్ 18న ఓ ప్రకటనలో తెలిపారు. 2022–24 బ్యాచ్ కోసం రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఫుల్ టైమ్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తులను కోరుతున్నామన్నారు. పీజీడీఎం విభాగంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, జనరల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రీయల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. పీజీడీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కోర్సులో అడ్మిషన్ కోసం ఇంజనీరింగ్‌లో ఏదైనా డిగ్రీ లేదా టెక్నాలజీలో డిగ్రీలో 50% మార్కులు సాధించినవారికి అవకాశం కల్పిస్తామన్నారు. పీజీడీఎం జనరల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్‌మెంట్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీలో 50% మార్కులు సాధించిన వారికి, పీజీడీఎం ఇండస్ట్రి్టయల్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో అడ్మిషన్ కోసం ఇంజనీరింగ్ లో బ్యాచ్‌లర్ డిగ్రీ లేదా టెక్నాలజీలో డిగ్రీ, ఫిజిక్స్ ప్రత్యేక సబ్జెక్టుగా సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అడ్మిషన్ కల్పిస్తామని వివరించారు. అడ్మిషన్లు పొందినవారికి మెరిట్ స్కాలర్‌షిప్ పొందే అవకాశముందని తెలిపారు.
చదవండి:
AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
Admission in JNAFAU: జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో 830 బీఆర్క్ సీట్లకు ప్రవేశాలు..