Anganwadi Helpers: అంగన్‌వాడీల ఆందోళన
Sakshi Education
పేద గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక సేవలు అందిస్తున్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్ పని, హెల్పర్ పని ఒక్కరే చేయాల్సి రావడంతో వీరికి పనిభారం ఎక్కువవుతోంది.
ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ మినీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ తక్షణం జీఓ ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యాన నవంబర్ 16న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
చదవండి: Teachers Strike: అటకెక్కిన చదువులు.. 10 రోజులుగా ఉపాధ్యాయుల సమ్మె
మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనే జీఓ ఉన్నా సక్రమంగా అమలు కావడం లేదని ఆవేదన చెందారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో 42 రోజుల పాటు అంగన్‌వాడీ వర్కర్లు గతంలో సమ్మె చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 27 Nov 2024 04:41PM