విద్యార్థుల మెస్ చార్జీల పెంపు.. కేటగిరి వారీగా పెంపు ఇలా..
ఈ మేరకు అర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలో జరిగిన భేటీలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ నిర్ణయించారు. తరగతులవారీగా పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం ఫైలుకు ఆమోదం లభిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెరగనున్న ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: CBSE: ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలను నమ్మొద్దు
మరింత మెరుగ్గా...
కోవిడ్ తర్వాత నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వసతిగృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు భోజన సదుపాయాలు కలి్పంచడం భారంగా మారింది. 2017లో ఖరారు చేసిన ధరల ప్రకారం పిల్లలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని అందించడం సాధ్యంకావట్లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం.. సంక్షేమ శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమైన ఉపసంఘం మెస్ చార్జీల పెంపు కోసం మూడు ప్రతిపాదనలు తయారు చేసింది. అలాగే చార్జీల పెంపు వల్ల ప్రభుత్వంపై పడనున్న అధనపు భారాన్ని సైతం సమీక్షించింది. 10 శాతం, 20 శాతం, 30 శాతం మేర పెంచితే తలెత్తే అంశాలను చర్చించిన మంత్రులు 25 శాతం మేర పెంపుదలకు మొగ్గు చూపారు.
చదవండి: ప్రైవేటు స్కూళ్లలో ఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
దీంతో సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులతోపాటు విద్యాశాఖ పరిధిలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా మెస్‌చార్జీలు పెరగనున్నాయి. అదేవిధంగా డే స్కాలర్ పద్ధతిలో ఉన్న పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు సైతం 25 శాతం మేర పెరగనున్నాయి. ఏటా సగటున రాష్ట్రవ్యాప్తంగా 12.5 లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులు, 5.5 లక్షల మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులు ఈ పథకాల కింద నమోదు చేసుకుంటున్నట్లు అంచనా.
ప్రసుత మెస్ చార్జీలు, తాజా ప్రతిపాదనలు (రూ.లలో)
తరగతి |
ప్రస్తుతం |
ప్రతిపాదన |
3 నుంచి 7 వరకు |
950 |
1,200 |
8 నుంచి 10 వరకు |
1,100 |
1,400 |
ఇంటర్ నుంచి పీజీ |
1,500 |
1,875 |
ఏటా రూ.3,302 కోట్లు అదనం
ప్రస్తుతం 25 శాతం డైట్ ఛార్జీలు పెంచడం వల్ల ఏటా రూ.3,302 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం ప్రతీనెల డైట్ ఛార్జీల కోసం రూ.1,053.84 కోట్లు వెచ్చిస్తుండగా, పెంచిన దానిని పరిగణలోకి తీసుకుంటే.. ప్రతీనెల రూ.1,329.02 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని డైట్ ఛార్జీల కంటే ఇవి చాలా ఎక్కువని వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,58,959 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. ఈ ఛార్జీల పెరుగుదల ముఖ్యమంత్రి ఆమోదం తరువాత అమలులోకి వస్తుంది.
కేటగిరి వారీగా..
తరగతి |
మొత్తం హాస్టల్స్ |
విద్యార్థుల సంఖ్య |
దళితులు |
1,136 |
2,43,673 |
గిరిజనులు |
812 |
2,15,934 |
వెనుకబడిన |
1,013 |
2,46,299 |
మైనారీటీలు |
216 |
1,30,549 |
జనరల్ |
37 |
23, 504 |
మొత్తం |
3,214 |
8,59,959 |