CBSE: ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలను నమ్మొద్దు
Sakshi Education
న్యూఢిల్లీ: 10, 12వ తరగతి బోర్డ్ పరీక్ష పత్రాలు లీకయ్యాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని Central Board of Secondary Education (CBSE) ఫిబ్రవరి 27న విద్యార్థులు, తల్లిదండ్రులను కోరింది.
ఈ పుకార్లకు కారకులని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పేపర్ లీకైందని, 2023 పరీక్షా పత్రాలు అందుబాటులో ఉన్నాయంటూ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీబీఎస్‌ఈ సభ్యుడొకరు తెలిపారు.
చదవండి: ఇక ఈ స్కూళ్లలోనూ సీబీఎస్‌ఈ విధానం
‘ఇలాంటి పుకార్లతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేందుకు కొందరు వ్యక్తులు, సమూహాలు, సంస్థలు పథకం వేస్తున్నాయి. బాధ్యతారాహిత్య చర్యలు, అయోమయం, భయాందోళనలకు పురిగొల్పే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి’అని పేర్కొన్నారు.
చదవండి: CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..
Published date : 28 Feb 2023 12:15PM