Skip to main content

School students: జిల్లానే ద‌త్త‌త తీసుకున్న విద్యార్థులు... చిన్నారుల సంక‌ల్పానికి స‌లాం చేయాల్సిందే.. క‌ర్త‌, క‌ర్మ‌ మ‌న తెలుగు క‌లెక్ట‌రే

కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతార‌ని ఓ సినీ క‌వి ఎప్పుడో చెప్పాడు. కానీ, అదే కృషి ఉంటే జిల్లాలో పేద‌రికాన్ని పాల‌దోల‌వ‌చ్చని ఓ జిల్లా క‌లెక్ట‌ర్ నిరూపిస్తున్నాడు. ఆయ‌న సంక‌ల్పానికి విద్యార్థులే ముందుకొచ్చారు.
School students

త‌లా ఒక చేయి వేసి ఆ జిల్లాలో ఉన్న క‌డు పేద‌రిక కుటుంబాల‌ను ఒడ్డున వేసేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకు కేర‌ళ‌లోని అలెప్పీ జిల్లా వేదికైంది. మ‌న తెలుగు వారైన కృష్ణ తేజ మ‌రో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. కేర‌ళ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఆయన పేరు దేశ‌మంతా వినిపించింది. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డంలో ఆయ‌న ఎప్పుడూ ముందువ‌రుస‌లో ఉంటారు. ఇప్పుడు కూడా అదే ల‌క్ష్యంతో త‌న జిల్లా నుంచి పేద‌రికాన్ని త‌రిమేసేందుకు పూనుకున్నారు. 

చ‌ద‌వండి: 11 ఏళ్ల ఆ చిన్నారి ... నెల‌కు కోటి రూపాయ‌ల సంపాద‌న‌ 
100 మంది విద్యార్థులు క‌లిసి ఓ కుటుంబం....
అలెప్పీ జిల్లా కలెక్టర్‌ వీఆర్‌ కృష్ణ తేజ.. చిల్డ్రన్ ఫర్ అలెప్పీ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో విద్యార్థులే భాగ‌స్వాములు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్వచ్ఛందంగా.. పేద కుటుంబాలను దత్తత తీసుకుంటారు. వంద మంది విద్యార్థులు కలిసి ఆర్థికంగా వెనకబడిన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటారు. ఈ 100 మంది విద్యార్థులు ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవ‌డం ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం.
పేద‌రికంలో 3,613 కుటుంబాలు
అలెప్పీ జిల్లాలో మొత్తం 3,613 కుటుంబాలు తీవ్ర పేదరికంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాగైనా వీరిని క‌డు పేద‌రికం నుంచి బ‌య‌టికి తీసుకురావాల‌ని కృష్ణ తేజ భావించారు. ఆ ఆలోచ‌న నుంచి పుట్టిందే చిల్డ్రన్ ఫర్ అలెప్పీ కార్య‌క్ర‌మం. 3,613 కుటుంబాలను విద్యార్థులు దత్తత తీసుకుని నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేస్తున్నారు. అలెప్పీ జిల్లాలోని 900కి పైగా విద్యాసంస్థలు ఉండగా అందులోని విద్యార్థులు 3,613 కుటుంబాలకు ఈ సాయాన్ని అందజేస్తారు.

చ‌ద‌వండి:​​​​​​​ ఇలా చేస్తే ఈజీగా అమెరికాకి వెళ్లొచ్చు... కొత్త నిబంధ‌న‌లు తెలుసా?
పేద కుటుంబాల‌కు అంద‌జేత‌....
విద్యార్థులు స్వచ్ఛందంగా బియ్యం, నగదు మినహా నిత్యావసరాలను పాఠశాలకు తీసుకొస్తారు. ఆహార పదార్థాలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌లతో సహా నిత్యావసరాలను పాఠశాలల్లో ప్యాక్‌ చేసి 'దత్తత' కుటుంబాలకు పంపిణీ చేస్తారు. దీని కోసం ప్రతి నెలా మొదటి సోమవారం పాఠశాలల్లో సమాజ సేవా దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఇలా విద్యార్థుల నుంచి సేకరించిన నిత్యావసరాలను విద్యార్థులే వారు దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు అందిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం వేసవి సెలవుల్లోనూ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
900 పాఠ‌శాల‌ల భాగ‌స్వామం....
చిల్డ్రన్ ఫర్ అలెప్పీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల రోజులలోపే.. దాదాపు 900 పాఠశాలలు ఇందులో భాగస్వాములయ్యాయి. తాము అనుకున్న దానికంటే విద్యార్థుల నుంచి భారీ స్పందన రావడంపై కృష్ణతేజ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్వచ్ఛంద కార్యక్రమైనా దాదాపు అన్ని పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఇందులో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన చెబుతారు. పేదరికాన్ని నిర్మూలించడంలో దేశంలోనే మొదటి జిల్లాగా అలెప్పీని తీర్చిదిద్దేందుకు.. విద్యార్థులే నాయకులుగా మారారని కృష్ణతేజ గ‌ర్వంగా చెబుతారు.

చ‌ద‌వండి:​​​​​​​ స్మార్ట్‌ఫోన్‌కు క‌ల్లెం వేశా.. రోజుకు ఐదు గంట‌లు చ‌దివా.. మా అమ్మ‌ క‌ల నెర‌వేర్చానిలా...

Published date : 25 Feb 2023 07:30PM

Photo Stories