Inspirational Story: నెలకు కోటి రూపాయల సంపాదన.. 11 ఏళ్ల ఆ చిన్నారి ఐడియాకు ప్రపంచమే ఫిదా
ఆలోచన ఉంటే ఆదాయం దానంతట అదే వస్తుందని చెప్తోంది 11 ఏళ్ల పిక్సీ కర్టిస్. ఆ చిన్నారి గురించి మరింత తెలుసుకుందాం పదండి. ఆస్ట్రేలియాకు చెందిన 'పిక్సీ కర్టిస్' నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తోంది. తన తల్లి ఏర్పాటు చేసిన కంపెనీలోనే తాను పనిచేస్తోంది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చిన్నారి పని చేస్తోంది. దీంతో నెలకు 1,33,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1.1 కోట్లు)జీతం తీసుకుంటోంది.
చదవండి: స్మార్ట్‌ఫోన్‌కు కల్లెం వేశా.. మాఅమ్మ కల నెరవేర్చానిలా...
కష్టేఫలికి నిలువెత్తు నిదర్శనం....
నెలకు భారీ మొత్తంగా శాలరీ తీసుకున్న వారి జాబితాలో పిక్సీ కూడా స్థానం సంపాదించింది. ఈ అమ్మాయికి సొంతంగా డ్రైవింగ్ రాకపోయినా రోజూ ఇంటికి, ఆఫీసుకి ఖరీదైన బెంజ్ కారులో తిరుగుతుంది. ఆ చిన్నారికి ఊరికే జీతం ఇస్తున్నారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఆ తల్లే కదా.. తన కూతురుకి ఇస్తోంది అని అనుకోవడం కూడా మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆ చిన్నారి తన ఆలోచనలకు పదునుపెట్టడంతోనే ఈ సంపాదన సాధ్యమైంది.
ప్రాడెక్ట్స్ భారీగా క్లిక్ అవడంతో....
పిక్సీ కర్టిస్ ఆఫీసులో పిల్లలకు సంబంధించిన హెయిర్ క్లిప్‌లు, రకరకాల హెడ్ బ్యాండ్స్ తయారు చేస్తుంది. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది. ఆ చిన్నారి చేసిన ప్రాడెక్ట్స్ భారీగా క్లిక్ అయ్యాయి. దీంతో కంపెనీ పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది. దీంతో ఆ చిన్నారికి అంత జీతం ఇస్తున్నారనమాట. అంతే కాకుండా కంపెనీలో జరిగే బోర్డు మీటింగులకు కూడా ఈ చిన్నారి హాజరవుతుంది.
చదవండి: ఫ్రీగా వసతితో పాటు స్టైఫండ్ మీకోసం... వివరాలకు చూడండి
40వేల డాలర్లతో గ్రాండ్‌గా....
ప్రస్తుతం చిన్నారి కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ తన తల్లి మాత్రం ఆ చిన్నారికి చదువే ముఖ్యంగా భావిస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఉద్యోగానికి రిటైర్‌మెంట్ కల్పించి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల తన 10వ బర్త్‌డేని 40,000 డాలర్లు ఖర్చు చేసి చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే గిఫ్ట్‌గా తన తల్లి లగ్జరీ బెంజ్ కారు ఇచ్చింది.