Research Internship Program: పరిశోధనలపై ఆసక్తి ఉందా... ఫ్రీగా వసతితో పాటు స్టైఫండ్ మీకోసం ఎదురుచూస్తోంది... వివరాలకు చూడండి
విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు అలాగే వారిని పరిశోధనల పరంగా ఎంకరేజ్ చేసేందుకు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
డిగ్రీ, పీజీ దశల్లోనే....
కొన్ని వందల పరిశోధనల్లో పాల్గొన్న అనుభవం ఉన్న ప్రొఫెసర్లు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. పరిశోధనా పత్రాలు ఎలా రాయాలి.. రీసెర్చ్ ఎలా మొదలు పెట్టాలి.. డ్రాయింగ్స్ ఎలా వేయాలి.. ఎలా ముగించాలి... తదితర వాటిపై విద్యార్థులకు కూలంకశంగా వివరిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిశోధనలకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. డిగ్రీ, పీజీ దశల్లోనే వారికి పరిశోధనలపై అవగాహన కల్పిస్తే.. భవిష్యత్తులో అద్భుతమైన ఆలోచనలు విద్యార్థుల నుంచి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: ఫిబ్రవరి 23న ‘‘ మెగా జాబ్ మేళ ’’
ఫండమెంటల్స్‌తో పాటు....
అయితే జీఐఎం.. బిగ్ డేటా అనలటిక్స్, ఫైనాన్స్ & అకౌంటింగ్, జనరల్ మేనేజ్‌మెంట్ & ఎకనమిక్స్, హెల్త్‌కేర్ & అకౌంటింగ్, ఐటీ & ఆపరేషన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, సంస్థాగత ప్రవర్తన తదితర అంశాలపై ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తుంది. విద్యార్థులు వీటిలో దేన్నైనా ఎంచుకునే సౌలభ్యం ఉంది. విద్యార్థి ఎంచుకున్న అంశంపై వారికి బేసిక్ ఫండమెంటల్స్‌తో పాటు సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన కల్పిస్తారు.
చదవండి: ఒక్క పరీక్షతో.. 44 సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశం!
స్టైఫండ్‌తో పాటు ఫ్రీగా వసతి....
సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 8 వారాల పాటు జరగనుంది. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ మూడో వారం వరకు ఉంటుంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. అలాగే కోర్సు ముగిసే వరకు ఫ్రీగా వసతి కల్పిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు Goa Institute of Management వెబ్‌సైట్‌ను సందర్శించండి.