Skip to main content

Mega Job Mela: ఫిబ్రవరి 23న ‘‘ మెగా జాబ్‌ మేళ ’’

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. హైదరాబాద్‌లో నిరుద్యోగుల కోసం భారీ జాబ్‌ మేళ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ హోం మినిస్టర్‌ మహ్మద్‌ ఆలీ, హెల్త్‌ మినిస్టర్‌ హరీష్‌రావు పోస్టర్లను విడుదల చేశారు.
Hyderabad Mega Job Mela

పది, ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు జాబ్‌ మేళాలో పాల్గొనొచ్చు. అలాగే ఎలాంటి అనుభవం లేని వారు కూడా మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. మొదట ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్‌ అయిన వారికి కాల్‌ లెటర్లు అందజేయనున్నారు. మొత్తం 1000 ఖాళీలున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు. 
చిరునామా: హైదరాబాద్‌ సిటీ పరిధిలోని మాసబ్‌ట్యాంక్‌ వద్దనున్న ఖాజా మాన్షన్‌.
తేదీ: ఫిబ్రవరి 23
సమయం: ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు

Published date : 21 Feb 2023 06:05PM

Photo Stories