Skip to main content

CUTE-UG 2023: ఒక్క పరీక్షతో.. 44 సెంట్రల్‌ వర్సిటీల్లో ప్రవేశం!

ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్, మెడిసిన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు నేటికీ లక్షల మంది విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే ఈ డిగ్రీని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నారు. అలాంటి వారికి చక్కటి మార్గంగా నిలుస్తోంది.. కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ-యూజీ). ఇందులో మెరుగైన స్కోర్‌ సాధిస్తే.. ప్రసిద్ధ 44 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకోవచ్చు. ఇటీవల సీయూఈటీ-యూజీ-2023కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. సీయూఈటీ-యూజీతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ఈ ఎంట్రెన్స్‌లో బెస్ట్‌ స్కోర్‌ సాధించేందుకు మార్గాలు..
cuet-ug 2023 notification
  • సీయూఈటీ-యూజీ-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యూజీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష
  • మే 21 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఎంట్రన్స్‌
  • అకడమిక్‌ నైపుణ్యాలతో మెరుగైన స్కోర్‌

సెంట్రల్‌ యూనివర్సిటీలు..జాతీయ స్థాయిలో పేరు గడించిన విద్యా సంస్థలు. వీటిలో ప్రవేశం కోసం గతంలో విద్యార్థులు ఒక్కో యూనివర్సిటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఆయా యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వహించే ఎంట్రెన్స్‌కు హాజరుకావల్సి వచ్చేది. దీంతో ఆర్థిక భారం, సమయాభావం వంటి సమస్యలు ఎదురయ్యేవి. దీనికి పరిష్కారంగా జాతీయ స్థాయిలో అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్ష నిర్వహించాలనే ఉద్దేశంతో కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ యూజీ)కి శ్రీకారం చుట్టారు. ఈ ఒక్క పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: NCHM-JEE 2023 After Class 10+2: ఆతిథ్య రంగంలో.. అందుకో అవకాశాలు!

పదమూడు భాషల్లో పరీక్ష

సీయూఈటీ-యూజీ పరీక్షను మొత్తం పదమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూల్లో ఈ పరీక్షకు హాజరుకావచ్చు. 

మూడు సెక్షన్లుగా.. సీయూఈటీ-యూజీ

సీయూఈటీ-యూజీ పరీక్షను మొత్తం మూడు సెక్షన్లుగా పరీక్ష నిర్వహించనున్నారు. ఆ వివరాలు..

సెక్షన్‌ సబ్జెక్ట్‌ అంశాలు ప్రశ్నల సంఖ్య
సెక్షన్‌-1ఎ(లాంగ్వేజెస్‌) 13 లాంగ్వేజెస్‌ 50
సెక్షన్‌-1బి(లాంగ్వేజెస్‌) 20 లాంగ్వేజెస్‌ 50
సెక్షన్‌-2(డొమైన్‌ సబ్జెక్ట్స్‌) 27 డొమైన్‌ సబ్జెక్ట్‌లు 45/50
సెక్షన్‌-3 జనరల్‌ టెస్ట్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ 60
  • సెక్షన్‌-1ఎలో అభ్యర్థులు 13 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు.
  • సెక్షన్‌-1బిలో అభ్యర్థులు 20 భాషల్లో ఏదో ఒక భాషను ఎంచుకోవచ్చు.
  • సెక్షన్‌-2 డొమైన్‌ సబ్జెక్ట్స్‌ విభాగంలో.. మొత్తం 27 డొమైన్‌ సబ్జెక్ట్స్‌ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు. 
  • సెక్షన్‌-2లో 45 లేదా 50 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో చాయిస్‌ విధానం మేరకు అభ్యర్థులు 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
  • మొత్తం 3 సెక్షన్లలో అభ్యర్థులు గరిష్టంగా పది సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం కల్పించారు.
  • సెక్షన్‌-1ఎ, సెక్షన్‌-1బి లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఎన్‌టీఏ నిర్దేశిత జాబితాలోని లాంగ్వేజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. -ప్రతి ప్రశ్నకు 5 మార్కులు కేటాయిస్తారు.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన మేరకు ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
  • సెక్షన్‌-1ఎ లాంగ్వేజెస్‌ వివరాలు: అస్సామీ, ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.

సెక్షన్‌-1బి లాంగ్వేజెస్‌ వివరాలు

అరబిక్, బోడో, చైనీస్, డోగ్రి, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కశ్మీరి, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలి, పర్షియన్, రష్యన్, సింధి, స్పానిష్, టిబెటిన్, సంస్కృతం.

డొమైన్‌ సబ్జెక్ట్‌ల వివరాలు

  • మొత్తం 27 డొమైన్‌ సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటి వివరాలు..
  • అకౌంటెన్సీ/బుక్‌ కీపింగ్‌; అగ్రికల్చర్‌; ఆంత్రోపాలజీ; బయాలజీ/బయోలాజికల్‌ స్టడీస్‌/బయోటెక్‌/బయో కెమిస్ట్రీ; బిజినెస్‌ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌; ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌; ఫైన్‌ ఆర్ట్స్‌/విజువల్‌ ఆర్ట్స్‌/కమర్షియల్‌ ఆర్ట్‌; జాగ్రఫీ/జియాలజీ; హిస్టరీ; హోమ్‌సైన్స్‌; నాలెడ్జ్‌ ట్రెడిషన్‌ ప్రాక్టీసెస్‌ ఇండియా; లీగల్‌ స్టడీస్‌; మాస్‌ మీడియా/మాస్‌ కమ్యూనికేషన్‌; మ్యాథమెటిక్స్‌; పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌; ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ఎన్‌సీసీ/యోగా; ఫిజిక్స్, పొలిటికల్‌ సైన్స్‌; సైకాలజీ; సంస్కృతం; టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌.
  • ఈ సబ్జెక్ట్‌లలో అభ్యర్థులు తమ అర్హతకు సరితూగే సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. డొమైన్‌ సబ్జెక్ట్స్‌లో గరిష్టంగా ఆరింటిని ఎంచుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

లాంగ్వేజ్, డొమైన్‌ అంశాల్లో

జాతీయ స్థాయిలో నిర్వహించే సీయూఈటీ-యూజీ పరీక్ష తీరును పరిశీలిస్తే.. అభ్యర్థుల్లోని లాంగ్వేజ్‌ స్కిల్స్, అదే విధంగా విద్యార్థులు బ్యాచిలర్‌ డిగ్రీలో చేరాలనుకుంటున్న సబ్జెక్ట్‌పై ఉన్న అవగాహనను పరీక్షించేలా పరీక్ష నిర్వహిస్తారు. 

మూడు షిఫ్ట్‌లలో పరీక్ష

మే 21 నుంచి మే 31 వరకు పది రోజుల పాటు సీయూఈటీని నిర్వహించనున్నారు. ప్రతి రోజు మూడు షిఫ్ట్‌లలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌ల ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లకు నిర్దేశించిన షిష్ట్‌లలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే తాము హాజరవ్వాలనుకుంటున్న షిఫ్ట్‌ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

స్కోర్‌ ఆధారంగా ప్రవేశం

సీయూఈటీ-యూజీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఆ స్కోర్‌ ఆధారంగా సెంట్రల్‌ యూనివర్సిటీలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మలి దశలో ప్రతి సెంట్రల్‌ యూనివర్సిటీ కూడా ప్రత్యేక ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తుంది. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. సెంట్రల్‌ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్న సీట్లు, సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేయనున్నాయి.

చ‌ద‌వండి: CUET UG 2023: ఒక్క పరీక్షతో.. 54 వర్సిటీల్లో ప్రవేశం

కనీసం 50 శాతం మార్కులు

సీయూఈటీ స్కోర్‌ ఆధారంగా సెంట్రల్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్‌లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందేలా చూసుకోవాలి. వాస్తవానికి సీయూఈటీ-యూజీకి ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సరిపోతుందని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. కానీ..సెంట్రల్‌ యూనివర్సిటీలు మాత్రం మలిదశ ప్రవేశ ప్రక్రియ, దరఖాస్తు సమయంలో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు ముందుగానే ఆయా వర్సిటీల ప్రవేశ అర్హతల నిబంధనలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. 

చ‌ద‌వండి: NCHM-JEE 2023 After Class 10+2: ఆతిథ్య రంగంలో.. అందుకో అవకాశాలు!

తెలుగు రాష్ట్రాల్లో 5 వర్సిటీలు

సీయూఈటీ-యూజీ-2023 స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో మొత్తం 44 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశ అవకాశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని.. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, నేషనల్‌ సాంస్క్రిట్‌ యూనివర్సిటీ; తెలంగాణలోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌ కూడా

  • సీయూఈటీ-యూజీ స్కోర్‌తో సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌కు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ, బీఎంఎల్‌ ముంజాల్‌ యూనివర్సిటీ తదితర మరో 50కు పైగా డీమ్డ్, ప్రైవేట్‌ యూనివర్సిటీలు కూడా సీయూఈటీ-యూజీ స్కోర్‌ ఆధారంగానే గతేడాది ప్రవేశాలు కల్పించాయి. 
  • ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని కొన్ని స్టేట్‌ యూనివర్సిటీలు కూడా సీయూఈటీ-యూజీ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

మంచి స్కోర్‌కు మార్గాలివే

  • జాతీయ స్థాయిలో నిర్వహించే సీయూఈటీకి లక్షల సంఖ్యలో పోటీ నెలకొంది.∙కాబట్టి అభ్యర్థులు మంచి స్కోర్‌ సాధించే దిశగా అడుగులు వేయాలి. 
  • పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ అకడమిక్‌ పుస్తకాలను ఔపోసన పట్టాలి. 
  • డొమైన్‌ సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి.
  • లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌ల కోసం సంబంధిత లాంగ్వేజ్‌ల గ్రామర్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా వాక్య నిర్మాణం, ప్రెసిస్‌ రైటింగ్, ప్యాసేజ్‌ రీడింగ్‌ ప్రాక్టీస్‌ చేయడమే కాకుండా.. సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. అదే విధంగా.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్‌లో లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీలలో పట్టు సాధించాలి. 
  • జనరల్‌ టెస్ట్‌: ఇందులో జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ నైపుణ్యాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ పుస్తకాలను చదవాలి. అదే విధంగా కరెంట్‌ ఈవెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. క్వాంటిటేటివ్‌ రీజనింగ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, నంబర్‌ సిస్టమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

ముఖ్య సమాచారం

  • అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి12, 2023
  • పరీక్ష కేంద్రం కేటాయింపు: ఏప్రిల్‌ 30, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: మే రెండో వారంలో
  • సీయూఈటీ-యూజీ పరీక్ష తేదీలు: మే 21 - మే 31,2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cuet.samarth.ac.in
Published date : 20 Feb 2023 05:46PM

Photo Stories