TGCHE: సరికొత్తగా యువత ఆలోచించాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్య సహా అన్ని రంగాల్లోనూ ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ దిశగా యువత సరికొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సూచించారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈ, టాంగా, ఇండోనేసియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన 31 మంది సీనియర్ రక్షణ అధికారులతో హైదరాబాద్‌లో హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ముగింపు కార్యక్రమం అక్టోబర్ 25న జరిగింది.
చదవండి: Engineering Seats: సీట్లొచ్చినా.. చేరేదెవరు?.. పెరగనున్న 3వేల సీట్లు..
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగంలో వస్తున్న మార్పులు, భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని దేశాలు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తెలంగాణ వ్యాప్తంగా విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 26 Oct 2024 02:47PM