Prof R Limbadri: అత్యున్నత స్థానానికి ఉన్నత విద్య
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు తేవడమే తమ లక్ష్యమని, రాష్ట్ర ఉన్నత విద్యను దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు అవిరళ కృషి చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అట్టడుగు వర్గాలకు ఉన్నత విద్యను దగ్గర చేసేందుకు మండలి సరికొత్త ప్రయోగాలు చేస్తోందని తెలంగాణ అవతరణ తర్వాత ఉన్నత విద్యలో అనేక సంస్కరణలకు నాంది పలికామని తెలిపారు.
చదవండి: TSCHE: నైపుణ్య డిగ్రీలతో బంగారు భవిత
విదేశీ యూనివర్సిటీలతో కలిసి, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫీజులు, క్రమబద్ధీకరణ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ ప్రకాశ్ పాల్గొన్నారు.
Published date : 03 Jun 2023 02:04PM