Skip to main content

TSCHE: నైపుణ్య డిగ్రీలతో బంగారు భవిత

సాక్షి, హైదరాబాద్‌: సంప్రదాయ డిగ్రీ కోర్సులకు నైపుణ్యాలు జోడిస్తే, మార్కెట్‌లో తిరుగులేని ఉపాధి లభిస్తుందని, ఈ దిశగానే రాష్ట్రంలో స్కిల్‌ ఆధారిత డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు.
TSCHE
నైపుణ్య డిగ్రీలతో బంగారు భవిత

ఉన్నత విద్యామండలి, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ స్కీమ్స్‌ అండ్‌ పాలసీస్‌ (సీఆర్‌ఐఎస్‌పీ) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 28న  ‘ఉన్నత విద్యలో పారిశ్రామిక నైపుణ్యాల ఏకీకృత విధానం’పై వర్క్‌షాప్‌ జరిగింది. ఆర్‌ లింబాద్రి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచే స్కిల్‌ ఓరియెంటేషన్‌ డిగ్రీ కోర్సులను కొన్ని కాలేజీల్లో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. కాగా, ఈ వర్క్‌షాప్‌లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో పాటు రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన విద్యారంగ నిపుణులు పాల్గొన్నారు. సాధారణ డిగ్రీ కోర్సులను నైపుణ్యాలతో అందించే దిశగా కేంద్రం కొన్ని స్కిల్‌ కోర్సులను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై వర్క్‌షాపులో నిపుణులు చర్చించారు. కోర్సులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్లో నైపుణ్యాలు పొందే వెసులుబాటు అవకాశాలు, బోధన ప్రణాళికలో తేవాల్సిన మార్పులపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 

చదవండి: Telangana: డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ నుంచే 10 వేల వేత‌నం.. వ‌చ్చే ఏడాది నుంచి తెలంగాణ‌లో అమ‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే

మే 1న విద్యారంగనిపుణుల భేటీ 

మే 1వ తేదీన ఈ కోర్సులకు సంబంధించి మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఆ భేటీలో కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు వీఎల్‌వీఎస్‌ఎస్‌ సుబ్బారావు పాల్గొన్నారు. రిటైలర్స్‌ అసొసియేషన్‌ సీఈవో జేమ్స్‌ రాఫెల్, వివిధ సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌ సీఈవోలు అభిలాష, రవికాంత్, ప్రవీణ్‌ సక్సేనా, సిద్ధిఖీ, ఆశిష్‌ జైన్, ఈశ్వర్‌పూజార్, అమిత్‌సింగ్‌ పలు సెక్టార్‌ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. పలు వర్సిటీల వీసీలు ప్రొఫెసర్‌ డీ రవీందర్, ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ మల్లేశ్, ప్రొఫెసర్‌ విజ్జులత, కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. 

చదవండి: Skill Colleges: స్కిల్‌ కాలేజీలు ప్రారంభం

Published date : 29 Apr 2023 03:58PM

Photo Stories