Telangana: డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే 10 వేల వేతనం.. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో అమలు.. పూర్తి వివరాలు ఇవే

ఇందుకు అవసరమైన కసరత్తును కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో పూర్తి చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వింటే.. మరో 3 రోజులు పని చేయాలి.
37 ప్రభుత్వ, 66 ప్రైవేటు కళాశాలలు
తెలంగాణ రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ విధానం అమలు చేయాలంటే విద్యార్థుల సంఖ్య కచ్చితంగా 500 మంది మించి ఉండాలి. ప్రభుత్వం సూచించే పది కోర్సుల్లో చేరిన వారికి మాత్రమే రూ.10 వేల వేతనం ఇచ్చే సౌలభ్యం వర్తిస్తుంది.

ఆ కోర్సులు ఇవే...
బీబీఏ(రిటైలింగ్), బీబీఎస్(ఈ-కామర్స్), బీబీఏ(లాజిస్టిక్స్), బీఎస్‌సీ(ఫిజికల్ సైన్స్), బీఏ(కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్)లో చేరిన వారికి ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. వీటితోపాటు బీకాం (ఈ-కామర్స్), బీకాం (హాస్పిటల్ మేనేజ్‌మెంట్)తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు నూతన విధానంలోకి తీసుకోనున్నారు. కొత్త విధానంతో విద్యార్థులకు చదువుకునే సమయం నుంచే సంపాదించడం అలవాటవుతుంది. అలాగే పేద తల్లిదండ్రులకు ఈ నిర్ణయంతో ఉపశమనం కలగనుంది.