School Holidays: స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 2 రోజులు సెలవు.. ఎందుకంటే!

పరమశివుడికి ఇష్టమైన ఈరోజు ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శిస్తుంటారు. ఈరోజు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు...భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. ఇలా హిందువుల పవిత్ర పండగ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరి 26న సెలవు ప్రకటించారు.
చదవండి: Holidays News: ఇకపై ప్రతి నాలుగో శనివారం కాలేజీలు, కార్యాలయాలకు సెలవు దినం!
ఇక ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 27న తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ తో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతి రోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది. ఇలా ఇరురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పోలింగ్ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో టీచర్లకు సాధారణ సెలవు ఇవ్వనున్నారు.
Inter Hall Tickets 2025: ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) మార్చి 1, 2025 నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3, 2025 నుండి సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
- మొదట bieap.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- "IPE March-2025 Hall Tickets Download" లింక్‌పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలను నమోదు చేయండి.
- మీ హాల్‌టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- దాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
ఈ సంవత్సరం, విద్యార్థులు వాట్సాప్ ద్వారా కూడా హాల్‌టికెట్లను పొందవచ్చు. దీనికి, 9552300009 నంబరును మీ ఫోన్‌లో సేవ్ చేసి, "హాయి" అని మెసేజ్ పంపండి. తదుపరి సూచనలను అనుసరించి, హాల్‌టికెట్‌ను పొందండి.
పరీక్షలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్‌తో పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలి.
తెలంగాణ ఇంటర్ హాల్‌టికెట్లలో ముఖ్యమైన మార్పులు..
ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది. ఈసారి హాల్ టికెట్లు పొందడంలో కొన్ని ప్రత్యేక మార్పులు ఉన్నాయి..
📱 మెసేజ్ రూపంలో హాల్ టికెట్లు: విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్లు నేరుగా పంపబడతాయి.
📍 క్యూఆర్ కోడ్‌తో పరీక్ష కేంద్రం వివరాలు: హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది, దానిని స్కాన్ చేసి పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో.. లొకేషన్, దూరం, ట్రాఫిక్ వివరాలు తెలుసుకోవచ్చు.
☎️ ఐవీఆర్ సపోర్ట్ నంబర్: సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు హాల్ టికెట్‌పై ఐవీఆర్ నంబర్ ఉంటుంది.
చదవండి: Telangana Jobs: డిగ్రీ అర్హతతో యూబిఐ తెలంగాణలో 304 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
చదవండి: Andhra Pradesh Jobs: డిగ్రీ అర్హతతో యూబిఐ ఆంధ్రప్రదేశ్‌లో 549 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |

Tags
- schools and colleges holidays
- Schools Holidays
- Good News For Students
- AP Schools Holidays
- TG Schools Holidays
- two days school holidays in ap
- two days school holidays in tg
- shivaratri holiday
- school and colleges
- ap mlc elections 2025
- Holiday news in telugu
- tg ap mlc elections 2025
- Schools and Colleges Two Days Holidays 2025
- Latest Holiday news in telugu