Skip to main content

విదేశాల్లో ఉన్నత విద్య విద్యార్థుల కల

హఫీజ్‌పేట్‌: అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి పేర్కొన్నారు.
Higher education abroad is the dream of students
రాయదుర్గం నాలెడ్జి సిటీలోని టీ హబ్‌లో గ్లోబల్‌ ఎడ్యు ఫెస్ట్‌ను ప్రారంభిస్తూ.. 

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీ హబ్‌లో ఐఎంఎఫ్‌ఎస్‌ ఆధ్వర్యంలో టీ హబ్‌ సహకారంతో గ్లోబల్‌ ఎడ్యు ఫెస్ట్‌లో ఆయన పాల్గొన్నారు. టీ–హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు, వాక్స్‌సెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌వీఆర్‌కె చలం, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయవారి వి.పట్టాబి, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫారెన్‌ స్టడీస్‌ ఫౌండర్, డైరెక్టర్‌ కె.పి.సింగ్, వి.అజయ్‌కుమార్‌లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఫిబ్రవరి 10న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చదవండి: Mahankali Srinivas Rao: ఇక స్టార్ట్‌..‘అప్‌’!.. 30 కాలేజీలతో అనుసంధానం..

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకోవడం, ఆ కళను సాకారం చేసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉన్నారని ఆయన అన్నారు. గతేడాది రికార్డు స్థాయిలో దేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్‌1 వీసాలు వస్తే.. అందులో అమ్మాయిలే అత్యధికంగా ఉన్నారని అన్నారు. ఆరేళ్లుగా విదేశీ విద్య కోసం వెళ్లే అమ్మాయిల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు ఈ ఫెస్ట్‌ను నిర్వహించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటికే 6,800 మంది విద్యార్థులు రిజి్రస్టేషన్లు చేయించుకున్నారని అన్నారు. 

చదవండి: Students: స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌ నివేదికను రూపొందించిన సంస్థ?

Published date : 11 Feb 2023 02:55PM

Photo Stories