BRAOU: ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు
Sakshi Education
నాగర్‌కర్నూల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అంజయ్య అక్టోబర్ 6న ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Job Mela news: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
ఇంటర్, ఏదైనా రెండేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 15వ తేదీలోగా అడ్మిషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. మరింత సమాచారం కోసం 73829 29779 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Published date : 07 Oct 2024 03:14PM