Due to Rain Exams Postponed 2023 : అలర్ట్.. స్కూల్స్, కాలేజీకు భారీగా సెలవులు.. ఈ పరీక్షలన్నీ వాయిదా.. వర్షాలు తగ్గేదాకా ఇంతే..!
ఇప్పటికే తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు వానలతో, బంద్‌లతో ఈ జూలై నెలలోనే భారీగా సెలవులు ఇచ్చారు. ఈ నెలలోనే దాదాపు 10 రోజులకు పైగా సెలవులు ఇచ్చారు. ఈ ప్రభారం అన్ని పరీక్షలపై పడింది.
పలు తేదీలు మార్పులు ఇవే..
తెలంగాణలో వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జూలై 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
స్కూల్స్‌లో కూడా..
తెలంగాణ పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షాలతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్‌ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఈ ప్రవేశాల తేదీని కూడా పొడిగింపు..
తెలంగాణలో భారీ వర్షాలతో వరుస సెలవులు, ఇంటర్నెట్, ఇతర ఇబ్బందుల నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును జూలై 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఇంకా లక్ష మందికిపైగా ఇంటర్‌లో చేరాల్సి ఉందని.. వానలు ఇలాగే కొనసాగితే గడువు పొడి గించాలని బోర్డ్ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.
పలు వర్సిటీల్లో పరీక్షలు వాయిదా.. అలాగే..
ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా పలు యూని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో అంతర్గత పరీక్షలు వాయిదా పడ్డాయి. వాటిని ఈ నెలాఖరులో నిర్వ హించాలని భావించినా.. వానలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆలస్యం కానున్నాయి. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని జూలై 28వ తేదీ వరకూ పొడిగించారు.
ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుంది. ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించే వీలుందని అధికారులు అంటున్నారు.
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెలవులు ఇవే..
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
Tags
- Telangana Exam Postponed
- Dost 2023 Postponed
- Telangana Universities
- Telangana Universities Exams Postponed due to rain
- TS Schools Holidays
- TS Colleges holidays 2023
- schools holidays due to rain
- Schools and Colleges Holiday due rain
- telangana exams postponed 2023
- Inter Admissions in Telangana
- DOST Admissions
- No college exams due to heavy rain
- exams postponed today