Skip to main content

AP & TS Schools and Colleges Holidays 2023 : జూలై 29, 30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు వ‌స్తున్నాయి. ఇటీవ‌లే తెలంగాణ‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో.. స్కూల్స్‌, కాలేజీలకు ఆరు రోజులు పాటు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే ఈ నెల‌లోనే స్కూల్స్‌, కాలేజీల‌కు రెండు రోజులు బంద్‌తో సెల‌వులు వ‌చ్చాయి.
TS Schools and Colleges Holidays News
TS & AP July 29 and 30th Schools and Colleges Holidays

అలాగే ఇప్పుడు జులై 29వ తేదీ (శ‌నివారం) మొహర్రం పండ‌గ ఉంది.. కాబట్టి పాఠశాలలకు సెలవు ఉండే అవ‌కాశం ఉంటుంది . అలాగే జులై 28వ తేదీ (శుక్ర‌వారం) కొన్ని ప్రాంతాల్లో కూడా మొహర్రం జరుపుకుంటారు. జులై 30వ తేదీన‌ ఆదివారం పాఠశాలకు, కాలేజీల‌కు సాధార‌ణంగానే హాలిడే. దీంతో కొన్ని పాఠశాలలకు వ‌రుస‌గా మూడు రోజుల పాటు సెలవు ఉండవచ్చు. ఈ జూలై నెల‌లోనే ఊహించ‌ని విధంగా స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు వ‌చ్చాయి. దీంతో ఉపాధ్యాయులకు స‌రైన టైమ్‌లో సిల‌బ‌స్ పూర్తి చేయ‌డంతో ఆట‌కం ఏర్పాడే అవ‌కాశం ఉంది.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

అలాగే ఆగ‌స్టు నెల‌లో కూడా వ‌చ్చే సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..

ap and ts schools & colleges holidays 2023 telugu news

ఆగస్టు 5వ తేదీన‌ శనివారం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 6వ తేదీ ఆదివారం కాబట్టి స్కూల్స్‌కి సాధార‌ణంగా సెల‌వు ఉంటుంది. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం స్కూల్స్‌కు సెలవు. ఆగస్టు 13 ఆదివారం సెల‌వు ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ (మంగ‌ళ‌వారం) స్వాతంత్య‌ దినోత్సవం సంద‌ర్భంగా పాఠశాలలకు, కాలేజీల‌కు సెలవు ఉంటుంది. ఆగస్టు 16, పార్సీ న్యూ ఇయర్, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు.

☛ Due To Heavy Rain Schools and Colleges Holidays 2023 : బ్రేకింగ్ న్యూస్‌.. అత్యంత భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. అలాగే ఆఫీస్‌ల‌కు కూడా..

ఆగస్టు 20వ తేదీ ఆదివారం హాలిడే. ఆగస్టు 27వ తేదీ ఆదివారం. ఆగస్టు 29వ తేదీ ఓనం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 30వ తేదీ(బుధ‌వారం) రక్షా బంధన్ సంద‌ర్భంగా పాఠశాలలకు సెలవు ఇస్తారు. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతంను బట్టి పైన పాఠశాలను సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.

తెలంగాణలో ఆగ‌స్టు 29, 30 (మంగ‌ళ‌వారం, బుధ‌వారం) వ‌రుస‌గా రెండు రోజుల‌ పాటు విద్యా సంస్థలకు సెల‌వులు రానున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగస్టు 29 ,30 తేదీలలో నిర్వహించ‌నున్న‌ది.

తెలంగాణ‌లో 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి సెల‌వులు ఇవే..
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

AP EAMCET Counselling 2023 Dates : ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు గమనించాల్సిన అంశాలు ఇవే.. మ‌ఖ్య‌మైన తేదీలు-ఫీజుల వివ‌రాలు ఇవే..

Published date : 26 Jul 2023 04:06PM

Photo Stories